Rayalaseema Natukodi Vepudu : రాయ‌ల‌సీమ స్టైల్‌లో నాటుకోడి వేపుడు ఇలా చేసి చూడండి.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Rayalaseema Natukodi Vepudu : మ‌న‌లో చాలా మంది నాటుకోడిని ఇష్టంగా తింటారు. దీనితో కూర‌, వేపుడు వంటి వాటిని త‌యారు చేసి తీసుకుంటూ ఉంటారు. నాటుకోడి వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ప‌ప్పు, చారు వంటి వాటితో సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అలాగే ఈ నాటుకోడి వేపుడును ఒక్కో ర‌కంగా త‌యారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా రాయ‌ల‌సీమ స్టైల్ లో చేసే ఈ నాటుకోడి వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మ‌రింత రుచిగా రాయ‌ల‌సీమ స్టైల్ లో నాటుకోడి వేపుడును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నాటుకోడి వేపుడు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 100 ఎమ్ ఎల్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, ఎండుమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, అర‌గంట పాటు ఉప్పు నీటిలో నాన‌బెట్టిన నాటుకోడి – అర‌కిలో, నీళ్లు – 750 ఎమ్ఎల్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Rayalaseema Natukodi Vepudu very tasty everybody can make it
Rayalaseema Natukodi Vepudu

మ‌సాలా పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి -3, తోక మిరియాలు – ఒక టీ స్పూన్, న‌ల్ల యాల‌క్కాయ – 1, అనాస పువ్వు – 1, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క‌, యాల‌కులు – 4, ల‌వంగాలు – 5, జాజికాయ పొడి – 2 చిటికెలు, వెల్లుల్లి రెబ్బ‌లు – 8.

నాటుకోడి వేపుడు త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో మ‌సాలా పొడికి కావ‌ల్సిన ప‌దార్థాల‌ను వేసి వేయించాలి. ఇందులో వెల్లుల్లి రెబ్బ‌లు త‌ప్ప మిగిలిన ప‌దార్థాలు వేసి వేయించాలి. ఇవ‌న్నీ వేగిన త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పొడిగా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ఉప్పు, ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత నాటుకోడి చికెన్ వేసి క‌ల‌పాలి. దీనిని 5 నిమిషాల పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ చికెన్ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. చికెన్ ఉడికి నీళ్లు ఆవిరైపోయిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పొడి వేసి క‌లపాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత కొత్తిమీర‌, మ‌రికొద్దిగా క‌రివేపాకు వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే నాటుకోడి వేపుడు త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts