realme : భారీ డిస్‌ప్లే, బ్యాట‌రీ.. అదిరిపోయే ఫీచ‌ర్లు.. రియ‌ల్‌మి 9 ప్రొ ప్ల‌స్ స్మార్ట్ ఫోన్‌..!

realme : మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి కొత్త‌గా రియ‌ల్‌మి 9 ప్రొ ప్ల‌స్ పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. 5జి కి స‌పోర్ట్ ల‌భిస్తుంది. అలాగే ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉంది. ఇక ఈ ఫోన్ లోని ఫీచ‌ర్ల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

realme 9 Pro Plus smart phone launched in India
realme

రియ‌ల్‌మి 9 ప్రొ ప్ల‌స్ స్మార్ట్ ఫోన్‌లో 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల డిస్‌ప్లే అద్భుత‌మైన క్వాలిటీని క‌లిగి ఉంటుంది. దీనికి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌ను కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్ లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెస‌ర్ ఉంది. అందువ‌ల్ల 5జి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.

ఈ ఫోన్ 6జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. రెండు సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. మెమొరీ కార్డు స్లాట్ లేదు. ఇందులో ఆండ్రాయిడ్ 12 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది. 2 ఏళ్ల వ‌ర‌కు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్ ల‌భిస్తాయి.

realme : 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా..

ఈ ఫోన్‌లో అద‌నంగా మ‌రో 5జీబీ వ‌ర‌కు వ‌ర్చువ‌ల్‌గా ర్యామ్‌ను పెంచుకునే స‌దుపాయాన్ని అందిస్తున్నారు. అలాగే ఫోన్ హీట్ కాకుండా ప్ర‌త్యేక కూలింగ్ సిస్ట‌మ్ ఉంది. ఈ ఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాను అమ‌ర్చారు. దీనికి తోడు అద‌నంగా మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు.

ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్‌లో ఉంది. డాల్బీ అట్మోస్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. క‌నుక సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. 5జి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్ సి వంటి ఇత‌ర ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. దీంట్లో 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. ఫాస్ట్ చార్జింగ్‌కు స‌పోర్ట్ ల‌భిస్తుంది. క‌నుక ఈ ఫోన్‌ను కేవ‌లం 15 నిమిషాల్లోనే 50 శాతం వర‌కు చార్జింగ్ చేసుకోవ‌చ్చు.

రియ‌ల్‌మి 9 ప్రొ ప్ల‌స్ స్మార్ట్ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.24,999 ఉండ‌గా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.26,999గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.28,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఈ నెల 21వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌తోపాలు రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌, ఇత‌ర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్ర‌యించ‌నున్నారు.

ఈ ఫోన్‌పై ప‌లు లాంచింగ్ ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో ఈ ఫోన్‌ను కొంటే రూ.2000 వ‌ర‌కు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తారు. ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ కింద మీ పాత ఫోన్‌కు గ‌రిష్ట ఎక్స్‌ఛేంజ్ ధ‌ర‌ను అందిస్తారు.

Share
Editor

Recent Posts