Rashmika Mandanna : త‌న‌కు ఎలాంటి వ్య‌క్తి భ‌ర్త‌గా కావాలో చెప్పేసిన ర‌ష్మిక మంద‌న్న‌..!

Rashmika Mandanna : పుష్ప సినిమాతో న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కు వ‌చ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె అంత‌కు ముందే నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారింది. అయితే పుష్ప సినిమాతో ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమెకు బాలీవుడ్‌లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఆమె ప‌లు హిందీ సినిమాల్లో న‌టిస్తోంది. అందుకు గాను ఆమె ముంబైలో ఈ మ‌ధ్యే ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసింది. అయితే ర‌ష్మిక మంద‌న్న త‌న‌కు ఎలాంటి వ్య‌క్తి భ‌ర్తగా కావాలో పరోక్షంగా చెప్పేసింది. ఈ మేర‌కు ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించింది.

Rashmika Mandanna said about love and marriage
Rashmika Mandanna

ర‌ష్మిక మంద‌న్న ఓ ఇంట‌ర్వ్యూలో ఇటీవ‌ల మాట్లాడుతూ.. ప్రేమ‌, పెళ్లిపై త‌న అభిప్రాయాలు తెలియ‌జేసింది. ఎవ‌ర్ని పెళ్లి చేసుకుంటే ర‌క్ష‌ణ‌, సౌక‌ర్యం ల‌భిస్తాయ‌ని అనుకుంటారో.. వారినే పెళ్లి చేసుకోవాల‌ని.. అప్పుడే వారి జీవితం ఆనందంగా ఉంటుంద‌ని తెలిపింది.

ఇక ప్రేమ‌పై ఈమె త‌న అభిప్రాయం చెబుతూ.. ల‌వ్ అనేది కేవ‌లం వ‌న్ సైడెడ్‌గా ఉండ‌కూడ‌ద‌ని, ఇద్ద‌రు వ్య‌క్తులు స‌మానంగా ఒక‌రినొక‌రు గౌర‌వించుకుంటూ ప్రేమించుకోవాల‌ని, వారి అభిప్రాయాల‌ను కూడా గౌర‌వించుకోవాల‌ని.. చెప్పింది. అంటే త‌న‌కు మ‌ర్యాద‌ను, సెక్యూరిటీని, ప్రేమ‌ను అందించే వ్య‌క్తి కోసం ర‌ష్మిక మంద‌న్న చూస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది.

కాగా ర‌ష్మిక మంద‌న్న ప్ర‌స్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్‌లో పాల్గొన‌నుంది. అలాగే ప‌లు బాలీవుడ్ చిత్రాల్లోనూ న‌టిస్తోంది. ఈమె శ‌ర్వానంద్‌తో క‌లిసి న‌టించిన ఆడ‌వాళ్లూ మీకు జోహార్లు మూవీ త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. అయితే ర‌ష్మిక మంద‌న్న అప్పుడ‌ప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి క‌నిపిస్తుంటుంది. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ షిప్ ఉంద‌ని అప్పుడ‌ప్పుడు వార్త‌లు వ‌స్తుంటాయి. కానీ వీరిద్ద‌రూ ఈ వార్త‌ల‌ను ఖండించ‌లేదు. మ‌రి భ‌విష్య‌త్తులో ఏమ‌వుతుందో చూడాలి.

Share
Editor

Recent Posts