Red Chutney For Tiffins : ఉద‌యం టిఫిన్ల‌లోకి ఒక్క‌సారి ఇలా ఎర్ర చ‌ట్నీ చేయండి.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Red Chutney For Tiffins : మ‌నం రోజూ టిఫిన్స్ లోకి ర‌క‌ర‌కాల చ‌ట్నీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చ‌ట్నీతో తింటేనే అల్పాహారాలు చాలా రుచిగా ఉంటాయి. మ‌నం ఎక్కువ‌గా ప‌ల్లి చ‌ట్నీ, కొబ్బ‌రి చ‌ట్నీ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా మనం కింద చెప్పిన విధంగా మ‌రింత రుచిగా ఉండే చ‌ట్నీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ రెడ్ చ‌ట్నీ టిఫిన్స్ లోకి చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని నిమిషాల వ్య‌వ‌ధిలోనే త‌యారు చేసుకోవ‌చ్చు. త‌ర‌చూ తినే చ‌ట్నీలు బోర్ కొట్టిన‌ప్పుడు ఇలా రెడ్ చ‌ట్నీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ రెడ్ చట్నీని ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

టిఫిన్ చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, ధ‌నియాలు – 2 టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 8, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 3, అల్లం – ఒక ఇంచు ముక్క‌, త‌రిగిన ట‌మాటాలు – 3, ఉప్పు -త‌గినంత‌.

Red Chutney For Tiffins recipe in telugu how to make this
Red Chutney For Tiffins

టిఫిన్ చ‌ట్నీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ధ‌నియాలు, ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి 3 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి వీటిని చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌గా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బ‌లు, క‌రివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత కొద్దిగా ఇంగువ‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో మిక్సీ ప‌ట్టుకున్న చ‌ట్నీని వేసి క‌లిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే టిపిన్ చ‌ట్నీ త‌యార‌వుతుంది. దీనిని ఇడ్లీ, దోశ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts