Giloy Juice : తిప్ప తీగ జ్యూస్‌ను అస‌లు రోజూ ఎంత మోతాదులో తీసుకోవాలి..? తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

Giloy Juice : మ‌న చుట్టూ ఉండే అద్భుత‌మైన ఔష‌ధ మొక్క‌లల్లో తిప్ప తీగ కూడా ఒక‌టి. ఈ మొక్క గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. రోడ్ల ప‌క్క‌న‌, చేను కంచెల వెంబ‌డి, పొలాల గట్ల మీద ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఈ మొక్క పెరుగుతూ ఉంటుంది. ఇత‌ర చెట్లకు అల్లుకుని ఎక్కువ‌గా పెరుగుతుంది. తిప్ప‌తీగ‌లో ఉండే ఔష‌ధ గుణాల గురించి ఎంత చెప్పిన త‌క్కువే అవుతుంది. ఈ మొక్క కాండాన్ని అలాగే వేర్ల‌ను మ‌నం ఔష‌ధంగా ఉప‌యోగించ‌వ‌చ్చు. తిప్ప తీగ‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి శ‌రీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను న‌శింప‌జేసి శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. తిప్ప‌తీగ‌ను వాడ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరంలో మ‌లినాలు, విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి.

అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. ఈ మొక్క‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది. కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేరకుండా ఉంటాయి. ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఇతా తిప్ప తీగ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ తిప్ప‌ను ఎలా తీసుకోవాలి…ఎంత మోతాదులో తీసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నంద‌రికి తాజాగా తిప్ప‌తీగ ల‌భించ‌దు. తాజాతిప్ప‌తీగ ల‌భించే వారు దీనినే ఎప్ప‌టికప్పుడు ఉప‌యోగించుకోవ‌చ్చు.

Giloy Juice how much we can consume per day
Giloy Juice

మ‌న చూపుడు వేలంత పొడుగు ఉండే తిప్ప తీగ కాండాన్ని తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత దీనిని రెండు గ్లాసుల నీటిలో వేసి ఒక గ్లాస్ అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి. త‌రువాత దీనిని వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా తాగాలి. ఇలా రోజూఒక గ్లాస్ తిప్ప తీగ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే తిప్ప‌తీగ డికాష‌న్ ను కూడా మ‌నం త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. దీనికోసం ఒక గిన్నెలో 2 ఇంచుల అల్లం ముక్క‌లు, 4 తుల‌సి ఆకులు, చూపుడు వేలు పొడువు ఉండే తిప్ప‌తీగ కాండాన్ని తీసుకోవాలి. త‌రువాత ఇందులో గ్లాసుల నీళ్లు పోసి ఒక గ్లాస్ అయ్యే వ‌ర‌కు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఇందులో 2 ల‌వంగాలు, 2 మిరియాలు వేసి మూత పెట్టి గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు ఉంచి వ‌డ‌క‌ట్టాలి.

ఇలా త‌యారు చేసుకున్న డికాష‌న్ ను రోజూ అర గ్లాస్ మోతాదులో తీసుకోవాలి. అలాగే మ‌న‌కు మార్కెట్ లో తిప్ప‌తీగ ట్యాబ్లెట్ల రూపంలో, జ్యూస్ రూపంలో కూడా ల‌భిస్తుంది. ఆయుర్వేద షాపుల‌ల్లో ఇవి మ‌న‌కు సుల‌భంగా ల‌భిస్తాయి. ఈ ట్యాబ్లెట్ల‌ను పెద్ద‌లు రోజుకు రెండు, 10 సంవ‌త్స‌రాల లోపు పిల్ల‌ల‌కు అర ట్యాబ్లెట్ ను, అదే 10 సంవత్స‌రాలు దాటిన పిల్ల‌ల‌కు రోజుకు ట్యాబ్లెట్ ను ఇవ్వాలి. ఈ విధంగా తిప్ప‌తీగ‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Share
D

Recent Posts