వినోదం

Viral Photo : ఈ చిన్నారి ఇప్పుడు గ్లామ‌ర‌స్ హీరోయిన్‌.. గుర్తు ప‌ట్టారా..?

Viral Photo : ఈ ఫోటోలో ఉన్న టాప్ హీరోయిన్ ని గుర్తు పట్టారా ? ఆమె తన చిన్నప్పటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆ ఫోటో గురించి వివరణ ఇచ్చింది. ఆ ఫోటో ఎప్పుడు తీయించుకుంది.. ఆ ఫోటో యొక్క ప్రాముఖ్యత గురించి వివరంగా అభిమానులతో షేర్ చేసుకుంది. ఆ భామ ఎవరా అని ఆలోచిస్తున్నారా.. ఎవరో కాదు. నోట్లో వేలు పెట్టుకొని ముద్దు ముద్దుగా కనిపిస్తున్న పాపగా హీరోయిన్ రెజీనా చాలా బాగుంది కదా. తన చిన్నతనంలో స్కూల్‌లో జరిగిన ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో ఈ డ్రెస్‌తో పాల్గొన్నప్పుడు తీసిన ఫొటో ఇది అని చెప్పింది.

అప్పుడు తనకే మొదటి బహుమతి వచ్చిందని పేర్కొంటూ అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది రెజీనా. ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ఉంటే వాళ్ల అమ్మ త‌న‌ను బాగా మేకప్ చేసేది. ఇక్కడ బాక్స్‌లో బొమ్మలా కనిపిస్తున్న నేను మా అమ్మకు చిట్టి బొమ్మను.

regina cassandra childhood photo viral

మళ్లీ పాపనైతే బాగుండు అనిపిస్తోంది. ఇదే కాదు మరో ఫాన్సీ డ్రెస్ ఫోటో కూడా ఉంది. వెతికి పట్టుకొని ఆ ఫోటో కూడా షేర్ చేస్తా. అందులో సగం కుమార్తెలా, సగం కుమారుడిలా కనిపిస్తా.. అని చెబుతూ ఆస‌క్తిక‌రంగా రెజినా పోస్ట్ చేసింది. కాగా రెజినా ఈ మ‌ధ్య కాలంలో వార్త‌ల్లో తెగ నిలిచింది. ఈమె న‌టించిన శాకిని ఢాకిని అనే మూవీ అట్ట‌ర్ ఫ్లాప్ కాగా.. మూవీ రిలీజ్ సంద‌ర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వివాదాస్ప‌దం అయ్యాయి.

Admin

Recent Posts