Jio : టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రెండు కొత్త ప్లాన్లను తాజాగా ప్రవేశపెట్టింది. వీటిని లాంగ్‌టైమ్ వాలిడిటీతో అందిస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్స్ విభాగంలో ఈ రెండు కొత్త ప్లాన్లు లభిస్తున్నాయి. రూ.2878, రూ.2998 ప్లాన్లను జియో ప్రవేశపెట్టింది. ఇక వీటిలో అందిస్తున్న బెనిఫిట్స్‌ను ఒక్కసారి పరిశీలిస్తే..
రూ.2878 ప్రీపెయిడ్ ప్లాన్‌తో వినియోగదారులకు రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు కనుక రోజుకు 2 జీబీ డేటా చొప్పున మొత్తం 730 జీబీ డేటా లభిస్తుంది. ఇక రూ.2998 ప్లాన్‌లోనూ 365 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఇందులో రోజుకు 2.5జీబీ డేటా వస్తుంది. అంటే మొత్తం 365 రోజుకుల 912.5 జీబీ డేటా లభిస్తుంది.
ఇక ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను వర్క్ ఫ్రమ్ హోమ్ విభాగంలో అందిస్తున్నారు. వీటిని జియో వెబ్‌సైట్‌తోపాటు మై జియో యాప్ ద్వారా కూడా రీచార్జి చేసుకోవచ్చు. కాగా ఈ రెండు ప్లాన్లలోనూ కేవలం డేటా మాత్రమే లభిస్తుంది. ఎలాంటి ఎస్ఎంఎస్‌లు, కాల్స్ రావు. మీరు ఇప్పటికే వాడుతున్న బేస్ ప్లాన్‌కు యాడ్ ఆన్‌గా మాత్రమే ఇవి లభిస్తాయి. కనుక బేస్ ప్లాన్‌ను కచ్చితంగా వాడాల్సి ఉంటుంది. ఇక వర్క్ ఫ్రమ్ చేసే వారికి అనువుగా ఈ ప్లాన్లను ప్రవేశపెట్టినట్లు జియో వెల్లడించింది.