Children Height : పిల్లలు బాగా ఎత్తు పెరగాలంటే.. వీటిని తినిపించండి..!

Children Height : తమ పిల్లలు వయస్సుకు తగిన ఎత్తు పెరగడం లేదని సహజంగానే తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అయితే వాస్తవానికి జన్యు పరంగా కూడా ఎత్తు అనే అంశం ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రుల ఎత్తుకు అనుగుణంగానే పిల్లలు ఎత్తు పెరుగుతుంటారు. అయితే ఇది కారణం కాకపోతే వారు పోషకాహార లోపం వల్లే ఎత్తు పెరగడం లేదని గుర్తించాలి. దీంతో వారికి రోజూ పోషకాహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే వారు వయస్సుకు తగిన ఎత్తు పెరుగుతారు. మరి అందుకు ఎలాంటి ఆహారాలను వారికి ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.

feed these foods for your Children Height
Children Height

1. సాధారణంగా ఎత్తు పెరగడానికి కాల్షియం అవసరం అవుతుంది. ఇది సోయా ఉత్పత్తుల్లో అధికంగా లభిస్తుంది. కనుక ఎత్తు పెరగాలనుకునేవారు సోయా ఉత్పత్తులను తీసుకోవాలి. సోయా బీన్స్‌, సోయా మిల్క్‌ను రోజూ పిల్లలకు ఇస్తే వారు ఎత్తు పెరుగుతారు.

2. పాలలోనూ కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎత్తు పెరిగేందుకు సహాయ పడుతుంది. కనుక రోజూ పిల్లలకు ఒక గ్లాస్‌ పాలను ఇవ్వాలి. దీంతో వారు వయస్సుకు తగిన ఎత్తు పెరుగుతారు.

3. మాంసాహారాల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక వీటిని పిల్లలకు ఇస్తే అవి వారికి అందుతాయి. దీంతో వారు సరైన రీతిలో ఎత్తు పెరుగుతారు.

4. కోడిగుడ్డులో ప్రోటీన్లు, కాల్షియం అధికంగా ఉంటాయి. కనుక పిల్లలకు రోజుకు ఒక గుడ్డును తినిపిస్తే వారు త్వరగా ఎత్తు పెరుగుతారు.

5. బెండకాయలు కూడా పిల్లల్లో ఎత్తును పెంచేందుకు దోహదపడతాయి. వీటిల్లో విటమిన్లు, ఫైబర్‌, మినరల్స్‌ అధికంగా ఉంటాయి. కనుక వీటిని పిల్లలకు తరచూ తినిపిస్తుంటే వారు ఎత్తు పెరుగుతారు.

6. పిల్లల ఎత్తును పెంచేందుకు బచ్చలికూర, పాలకూర వంటివి కూడా తోడ్పడుతాయి. వీటిల్లోనూ కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎత్తు పెరిగేందుకు సహాయపడుతుంది.

Share
Admin

Recent Posts