Foxtail Millets : కొర్రలను రోజూ తింటే అద్భుతమైన ప్రయోజనాలు..!

Foxtail Millets : గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చే ర‌క‌ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు ముఖ్య కార‌ణం మ‌నం తీసుకునే ఆహారం అని తేలింది. ఆహారాన్ని బాగా రిఫైన్ చేసి తిన‌డం వ‌ల్ల పోష‌కాహార లోపాలు రావ‌డంతోపాటు కొన్ని ర‌కాల దీర్ఘ‌కాలిక వ్యాధులు ముందుగా రావ‌డం జ‌రుగుతోంది. రోజూ వారిగా మ‌నం తీసుకునే వ‌రి ధాన్యం, గోధుమ‌ల‌కు బదులుగా తృణ ధాన్యాలు ఉత్త‌మ‌మైన‌వి శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. కొన్ని వేల సంవ‌త్స‌రాల క్రితం నాటివి అయిన‌ప్ప‌టికీ రోజూ వీటి అవ‌స‌రం వస్తోంది. తృణ ధాన్యాలు అని చెప్ప‌డానికి కార‌ణం ఈ ధాన్య‌పు గింజ‌లు సైజులో సూక్ష్మంగా ఉండ‌డమే అని చెప్పవచ్చు. ఇవి గ‌డ్డి జాతికి చెందిన తృణ ధాన్య‌పు ర‌కాలు. వీటిని ఆసియా, ఆఫ్రికా దేశాల‌లో కొన్ని వేల సంవత్స‌రాలుగా పండించి తినేవారు. వీటిని ముఖ్యంగా జంతువుల‌కు, ప‌క్షుల‌కు ఆహారంగా ఎక్కువ‌గా వాడేవారు.

take Foxtail Millets daily for these amazing health benefits
Foxtail Millets

తృణ ధాన్యాల‌లో అత్య‌ధిక పోష‌క విలువ‌లు ఉన్నందున, ఆహార నిపుణులు వీటిని తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. వీటిలో అత్య‌ధికంగా పీచు ప‌దార్థాలు ఉన్నందున కొన్ని ర‌కాల వ్యాధులు అన‌గా మ‌ధుమేహం, ఊబ‌కాయం, బ్రెస్ట్ క్యాన్స‌ర్‌, స్త్రీల‌లో వ‌చ్చే క‌ణుతులు రాకుండా ఉంటాయి. అందువల్ల చిరు ధాన్యాల్లో ఒకటైన కొర్రలను రోజూ ఏదో ఒక విధంగా తీసుకోవాలి. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

1. వీటిలో గ్లూటిన్ అనే ప‌దార్థం అత్య‌ల్పంగా ఉన్నందున ఏడీహెచ్ డీ, ఆజిటిమ్‌, గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌ల‌కు మంచి ఆహారంగా చెప్పుకోవ‌చ్చు.

2. వీటిలో మెగ్నీషియం, ఫాస్ప‌ర‌స్‌, ఐర‌న్‌, కాల్షియం, జింక్ , పొటాషియం అనేవి రోజూ వారి అవ‌స‌రాల‌కు స‌రిప‌డినంతా మ‌న శ‌రీరానికి అందిస్తాయి.

3. వీటిని వండ‌డానికి, ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాలను త‌యారు చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ప‌డుతుంది.

4. కొర్ర‌ల‌ను రెండు, మూడు సంవ‌త్స‌రాల పాటు నిల్వ చేయ‌వ‌చ్చు. వీటిని ఆహారంలో భాగంగా పిల్ల‌ల‌కు, గ‌ర్భిణిల‌కు, వృద్ధుల‌కు, అత్య‌ధిక శారీర‌క శ్ర‌మ చేసే వారికి ఇస్తే ఆరోగ్యంగా ఉంటారు.

5. రుచిక‌రమైన కొర్ర బియ్యం ఆహారంపై ఇష్టాన్ని పెంచుతాయి. గుండె జ‌బ్బులు , కొలెస్ట్రాల్ స‌మ‌స్యలు గ‌ల వారు వీటిని తీసుకోవ‌డం ద్వారా వీటిలో ఉండే మెగ్నీషియం శ‌రీరంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ వేగాన్ని త‌గ్గిస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది.

6. ర‌క్తంలోని ఇన్సులిన్‌ ని త‌గ్గించ‌డానికి వీటిలోని పీచు ప‌దార్థాలు, ప్రోటీన్లు ఎంత‌గానో స‌హాయ ప‌డ‌తాయి. కనుక కొర్రలను తింటుంటే షుగర్‌ తగ్గుతుంది.

7. కొర్ర‌లు జీర్ణ వ్య‌వ‌స్థ‌లోని మంచి బ్యాక్టీరియాకు సహాయం చేస్తాయి. దీంతో మ‌లబ‌ద్ద‌కం లేకుండా చేస్తాయి. ముఖ్యంగా త‌రచూ మలబద్దకం స‌మ‌స్య క‌ల‌వారు వీటిని ఆహారంగా తీసుకోవ‌డం ద్వారా స‌మ‌స్య అదుపులోకి వస్తుంది.

8. వీటిల్లో ఉండే కుర్‌క్యుమిన్‌, ఎల్లాజిక్, క్యూర్‌సెటిన్ అనే ప‌దార్థాలు శ‌రీరంలోని చెడు క‌ణాల‌ను నిర్మూలించి యాంటీ ఆక్సిడెంట్లుగా ప‌ని చేస్తాయి. అందువల్ల వ్యాధులు రాకుండా ఉంటాయి.

9. శ‌రీర కండ‌రాలు బ‌ల‌హీన ప‌డ‌కుండా స‌హాయ‌ప‌డ‌తాయి. కండరాలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.

10. వీటిలో ట్రైప్టోపాన్ అనే ప‌దార్థం సెరొటోనిమ్ అనే ప‌దార్థాన్ని పెంచి మాన‌సిక ఒత్తిడిని త‌గ్గిస్తుంది.

11. కొర్రలలో ఉండే మెగ్నీషియం స్త్రీల‌కు వ‌చ్చే మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను, ర‌క్త‌స్రావం, పొత్తి క‌డుపు నొప్పిని త‌గ్గిస్తాయి.

12. రాగులు, జొన్న‌లు, స‌జ్జలు కూడా చిరు ధాన్యాలే. వీటిని కాలానుగుణంగా ర‌క‌ర‌కాల ప‌ద్దతులలో వండుకుంటే మంచి గుణం ఉంటుంది.

13. స్త్రీల‌కు గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో, బాలింత‌ల‌కు వీటిని ఆహారంలో భాగంగా ఇస్తుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

14. ఈ ధాన్యాలు.. ముఖ్యంగా కొర్ర‌లను త‌రచూ ఆహారంలో భాగంగా తీసుకుంటే చ‌ర్మం సాగ‌కుండా, ముడుచుకు పోకుండా వీటిల్లో ఉండే అమైనో యాసిడ్లు స‌హాయ‌ప‌డ‌తాయి. దీంతో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

15. కొర్ర‌ల్లో నియాసిన్ అధికంగా ఉన్నందున కొలెస్ట్రాల్‌ని నియంత్ర‌ణ‌లో ఉంచుతుంది. దీంతో హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా గుండె సురక్షితంగా ఉంటుంది.

16. వీటిని పాలిష్ పెట్ట‌కుండా స‌హ‌జంగా తీసుకోవ‌డం మంచిది. వీటిని మితంగా తీసుకోవాలి. థైరాయిడ్ స‌మ‌స్య ఉన్నవారు నిపుణుల‌ను సంప్ర‌దించి రోజూ వారి ఆహారంలో చేర్చుకోవ‌చ్చు.

D

Recent Posts