technology

రిల‌య‌న్స్ జియో మ‌రో మాస్ట‌ర్ స్ట్రోక్ ప్లాన్ లాంచ్.. వివ‌రాలు ఏంటంటే..?

ఇండియన్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియోకి బీఎస్ఎన్ఎల్ పోటీ వ‌స్తుండ‌డంతో ఇప్పుడు జియో సరికొత్త రీచార్జ్ ప్లాన్స్ లాంచ్ చేస్తుంది. ఒకప్పుడు అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో ప్ర‌త్యే ప్యాకేజీలు తీసుకొచ్చిన ఈ సంస్థ, ఇప్పుడు యూజర్లకు మ‌రింత వినోదాన్ని పంచేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. క‌స్ట‌మ‌ర్స్ కి మ‌రింత చేరువ‌య్యేందుకు కూడా కొన్ని ప్ర‌త్యేక ప్యాకేజీల‌ని అందిస్తుంది. రిలయన్స్ జియో రూ. 319 ధరతో ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది, ఇది సాధారణ 28 రోజుల కంటే రెండు రోజుల పాటు అదనంగా అంటే 30 రోజుల చెల్లుబాటును అందిస్తోంది. కస్టమర్‌లు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు అదనపు డేటా ప్రయోజనాలను కూడా పొందుతారు.

ప్ర‌తి రోజు వంద ఎస్ఎంఎస్‌లు, 1.5 GB డేటా పొందుతారు. కానీ వినియోగదారు రోజువారీ డేటా కోటాను పూర్తి చేస్తే, అప్పుడు వేగం 64 kbpsకి తగ్గుతుంది. ఇక వీటితో పాటు జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌లను కూడా పొందుతారు. కానీ కస్టమర్ జియో సినిమాలో ప్రీమియం కంటెంట్‌ని ఆస్వాదించలేరు. ఇది కాకుండా, కంపెనీ రూ. 355 ధరతో ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది, ఇది 30 రోజుల చెల్లుబాటును కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ 25 GB డేటాను అందిస్తుంది . ఇక ఇతర ప్రయోజనాలు రూ. 319 ప్లాన్‌కు సమానంగా ఉంటాయి. రిలయన్స్ జియో తాజాగా రూ.175 రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. ఈ గడువులో కస్టమర్లకు డైలీ లిమిట్ లేకుండా 10 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది.

reliance jio launched this plan for its users

అలాగే 12 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లను ఉచితంగా అందిస్తుంది. అయితే ఈ ప్లాన్‌తో ఒక పెద్ద డ్రాబ్యాక్ ఉంది. అదేంటంటే, రూ.175 ప్లాన్‌ కేవలం ఎంటర్‌టైన్మెంట్ లవర్స్ కోసమే ఉపయోగపడుంది. దీనితో వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ ఉండవు. మరోవైపు రిలయన్స్ జియో ఇటీవల అన్‌లిమిటెడ్ 5G డేటా, ఫ్రీ కాలింగ్ సర్వీస్‌ అందించే రూ.999 రీఛార్జ్ ప్లాన్లు కూడా లాంచ్ చేసింది. దీని వ్యాలిడిటీ 98 రోజులు. అలాగే ఇటీవల జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024లో కంపెనీ రెండు కొత్త 4G ఫీచర్ ఫోన్లు జియో భారత్ V3, జియో భారత్ V4 మోడళ్లను రిలీజ్ చేసింది. 4G నెట్‌వర్క్‌తో పనిచేసే ఈ హ్యాండ్‌సెట్లు తక్కువ ధరకే యూజర్లకు కాలిండ్, డేటా, ఓటీటీ సర్వీస్‌లను ఆఫర్ చేస్తాయి. వీటి ధరను రూ.1099గా నిర్ణయించారు.

Sam

Recent Posts