Rice Nachos : బియ్యంపిండితో ఇలా చిప్స్ చేయండి.. కరకరలాడుతూ నెల రోజులు తిన‌వ‌చ్చు..!

Rice Nachos : మ‌నం బియ్యంపిండితో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను, పిండి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బియ్యంపిండితో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా, కర‌క‌ర‌లాడుతూ ఎంతో క్రిస్పీగా ఉంటాయి. బియ్యంపిండితో చేసే చిరుతిళ్ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. బియ్యంపిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్లల్లో రైస్ నాచోస్ కూడా ఒక‌టి. క్రిస్పీగా, రుచిగా ఉండే ఈ రైస్ నాచోస్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. కేవ‌లం 15 నిమిషాల్లోనే ఈ రైస్ నాచోస్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. పిల్ల‌లు వీటిని ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగాఉండే ఈ రైస్ నాచోస్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రైస్ నాచోస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యంపిండి – ఒక క‌ప్పు, నీళ్లు – ముప్పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా, కారం – అర టీ స్పూన్, చాట్ మ‌సాలా – అర టీ స్పూన్.

Rice Nachos recipe in telugu make in this method
Rice Nachos

రైస్ నాచోస్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. ఇందులోనే ఉప్పు, జీల‌క‌ర్ర వేసి నీటిని మ‌రిగించాలి . నీరు మ‌రిగిన త‌రువాత బియ్యంపిండి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత పిండిపై మూత పెట్టి పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి. పిండి చ‌ల్లారిన త‌రువాత చేత్తో వ‌త్తుతూ బాగా క‌లుపుకోవాలి. త‌రువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ పొడి పిండి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా వ‌త్తుకోవాలి. త‌రువాత అంచుల‌ను తీసేసి ఫోర్క్ తో అక్క‌డ‌క్క‌డ గాట్లు పెట్టుకోవాలి. త‌రువాత కత్తితో లేదా పిజ్జా క‌ట‌ర్ తో మ‌న‌కు న‌చ్చిన ఆకారంలో క‌ట్ చేసుకోవాలి.

ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక నాచోస్ ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై గోల్డెన్ క‌లర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత వీటిపై కారం, చాట్ మ‌సాలా చ‌ల్లుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రైస్ నాచోస్ త‌యార‌వుతాయి. వీటిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి.

D

Recent Posts