Gutti Capsicum Masala Curry : గుత్తి వంకాయ‌లాగే క్యాప్సిక‌మ్‌ను కూడా ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Gutti Capsicum Masala Curry : మ‌నం క్యాప్సికంను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. క్యాప్సికం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో కూడా అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వివిధ ర‌కాల వంట‌కాల్లో వాడ‌డంతో పాటు క్యాప్సికంతో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. క్యాప్సికంతో చేసుకోదగిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో గుత్తి క్యాప్సికం మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. క్యాప్సికంతో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే ఈ గుత్తి క్యాప్సికం మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గుత్తి క్యాప్సికం మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క్యాప్సికం – 150 గ్రా., నూనె – 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌చ్చిమిర్చి – 3, నాన‌బెట్టిన చింత‌పండు – చిన్న నిమ్మకాయంత‌, నీళ్లు – ముప్పావు గ్లాస్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Gutti Capsicum Masala Curry recipe in telugu make in this method
Gutti Capsicum Masala Curry

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 2, మిరియాలు – అర టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, నువ్వులు – ఒక టీ స్పూన్, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – చిటికెడు, నూనె – ఒక టేబుల్ స్పూన్, అల్లం – ఒక ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ట‌మాటాలు – 2, కారం – 2 టీ స్పూన్స్, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌.

గుత్తి క్యాప్సికం మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ప‌ల్లీలు, దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, యాల‌కులు, మిన‌ప‌ప్పు, శ‌న‌గ‌ప‌ప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత ధ‌నియాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. చివ‌ర‌గా నువ్వులు, ఎండుకొబ్బ‌రి ముక్క‌లు వేసి వేయించి జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మూత పెట్టి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చ‌ల్లారిన త‌రువాత వీటిని కూడా ప‌ల్లీలు తీసుకున్న జార్ లోనే వేసుకోవాలి. త‌రువాత కారం, ఉప్పు, ప‌సుపు కూడా వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.

త‌రువాత క్యాప్సికంకు ఉండే తొడిమ‌ల‌ను తీసేసి అలాగే వాటి లోపల ఉండే గింజ‌ల‌ను కూడా తీసేసి ప‌క్కకు ఉంచాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క్యాప్సికం వేసి వేయించాలి. వీటిని 5 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో తాళింపు దినుసులు, క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత చింత‌పండు ర‌సం, నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత వేయించిన క్యాప్సికం వేసి మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గుత్తి క్యాప్సికం మ‌సాలా క‌ర్రీ త‌యారవుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన క్యాప్సికం క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts