RRR : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా అదిరిపోయిందని ఇప్పటికే ప్రీమియర్ షో చూసిన వారు చెబుతున్నారు. రాజమౌళి మరో హిట్ కొట్టారని అంటున్నారు. ఆయనను ప్రేక్షకులు ఆకాశానికెత్తేస్తున్నారు. ఇక ఈ సినిమాకు గాను థియేటర్లు అన్నీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వచ్చే వారం పాటు నిండిపోయాయి. దీంతో టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక కొన్ని థియేటర్ల వద్ద ఒక్కో టిక్కెట్‌ను అధికారికంగానే రూ.2000 కు విక్రయిస్తున్నారు. బ్లాక్‌లో అయితే టిక్కెట్ ధర ఏకంగా రూ.5000 పలుకుతోంది.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమా అనుకున్న తేదీ కన్నా ముందుగానే ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాకు గాను అన్ని డిజిటల్, టీవీ రైట్స్‌ను జీ5 సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే సినిమా హిట్ అయితే ఇంకో 20 రోజుల పాటు థియేటర్లలో అదనంగా నడిపిస్తారు. కనుక సినిమా విడుదలయ్యాక 50 రోజుల వరకు ఓటీటీలోకి వచ్చేస్తుందని తెలుస్తోంది. దీంతో మే మొదటి వారంలో ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్‌టీఆర్, ఆలియాభట్, అజయ్ దేవగన్‌లు కీలకపాత్రల్లో నటించారు. చరణ్ అల్లూరిగా.. ఎన్టీఆర్ భీమ్‌గా అలరించనున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తుండగా.. ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ మూవీ రికార్డులు సృష్టించడమే మిగిలి ఉందని అంటున్నారు.