Nayanthara : పిల్ల‌ల్ని క‌నాల‌నే ఆలోచ‌న‌పై న‌య‌న‌తార క్లారిటీ.. ఏమ‌న్న‌దంటే..?

Nayanthara : లేడీ సూప‌ర్ స్టార్‌గా పేరుగాంచిన న‌య‌న‌తార ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈమె త‌న ప్రియుడు విగ్నేష్ శివ‌న్‌ను గ‌తంలో ఎప్పుడో ర‌హ‌స్య వివాహం చేసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అందుకు సాక్ష్యంగా ఆమె ఓ ఆల‌యంలో నుదుట‌న సింధూరం ధ‌రించిన ఫొటోల‌ను కూడా వైర‌ల్ చేశారు. దీంతో వీరి వివాహం జ‌రిగింది.. అనే వార్త‌ల‌కు బ‌లం చేకూరింది. అయితే తాజాగా ఈ జంట గురించి ఇంకో వార్త వైర‌ల్ అయింది. న‌య‌న‌తార స‌రోగ‌సి ప‌ద్ధ‌తిలో పిల్ల‌ల్ని క‌నాల‌ని అనుకుంటుంద‌ని.. వార్త‌లు వ‌చ్చాయి.

Nayanthara team responded on her pregnancy news
Nayanthara

అయితే న‌య‌న‌తార టీమ్ ఈ విష‌యంపై స్పందించింది. అలా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతున్న వార్త‌ల్లో ఎంత మాత్రం నిజం లేద‌ని.. ఆ వార్త‌ల‌ను కొట్టి పారేసింది. అందువ‌ల్ల ఈ జంట పిల్ల‌ల్ని కంటున్నార‌నే వార్త‌లు అబ‌ద్ధ‌మ‌ని తేలింది. అయితే వీరు పెళ్లి చేసుకున్న విష‌యంపై మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు. దీంతో వీరికి పెళ్లి అయింద‌నే భావిస్తున్నారు. అయితే ఈ విష‌యాన్ని వారు త్వ‌ర‌లోనే అధికారికంగా బ‌య‌ట పెడ‌తార‌ని తెలుస్తోంది.

ఇక న‌య‌న‌తార ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉంది. త‌న ప్రియుడు విగ్నేష్ శివ‌న్ తెర‌కెక్కించిన కాతు వాకుల రెండు కాద‌ల్ అనే మూవీలో న‌య‌న‌తార న‌టించింది. ఇందులో స‌మంత‌, విజ‌య్ సేతుప‌తిలు కూడా కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ఈ మూవీ ఏప్రిల్‌లో విడుద‌ల కానుంది. ఇక చిరంజీవి మెయిన్ రోల్‌లో తెర‌కెక్కుతున్న గాడ్ ఫాద‌ర్ అనే మూవీలోనూ న‌య‌న‌తార న‌టిస్తోంది. ఈ మూవీకు గాను త‌న పార్ట్ షూటింగ్‌ను న‌య‌న‌తార ఇటీవ‌లే పూర్తి చేసుకుంద‌ని తెలుస్తోంది.

Editor

Recent Posts