Rusk Payasam : ర‌స్క్ పాయ‌సం ఎప్పుడైనా విన్నారా.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..!

Rusk Payasam : మనం ఇదివరకు సేమియా పాయసం, పెసరపప్పు పాయసం, శనగపప్పు పాయసం గురించి విన్నాము. వాటి రుచిని కూడా తెలుసుకున్నాము. కానీ వీటన్నింటి కంటే భిన్నంగా రస్క్ పాయసం గురించి బహుశా వినక పోయి ఉండవచ్చు. అయితే ఎంతో రుచికరమైన రస్క్ పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

ర‌స్క్ పాయ‌సం త‌యారీకి కావలసిన పదార్థాలు..

రస్క్ పొడి – ఒక కప్పు, చిక్కని పాలు – ఒకటిన్నర కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, చక్కెర – 5 టీ స్పూన్లు, ఏలకుల పొడి – టేబుల్ స్పూన్, జీడిపప్పు ముక్కలు – రెండు టేబుల్ స్పూన్లు, ఎండుద్రాక్ష – కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు.

Rusk Payasam recipe in telugu very tasty easy to make
Rusk Payasam

ర‌స్క్ పాయ‌సం తయారీ విధానం..

ముందుగా స్టవ్ మీద కడాయి ఉంచి అందులో టేబుల్ స్పూన్ నూనె వేసి జీడిపప్పు, ఎండుద్రాక్షలు, కొబ్బరి తురుము దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా పాలను బాగా మరిగించుకొని వాటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో రస్క్ పొడి వేసి కలియబెడుతూ తరువాత చల్లారిన పాలు పోసి ఉండలు లేకుండా కలియబెడుతూ ఉండాలి. ఈ మిశ్రమం కొద్దిగా చిక్కబడిన తర్వాత పంచదార వేసి గరిటతో కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ఏలకుల పొడి వేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కొబ్బరి తురుము వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రస్క్ పాయసం తయారైనట్లే. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఎప్పుడూ రొటీన్‌గా చేసుకునే పాయ‌సానికి బ‌దులు ఇలా ఒక్క‌సారి చేసుకుని తినండి. అంద‌రికీ న‌చ్చుతుంది.

Editor

Recent Posts