Mango Papad : మామిడి పండుతో ఎంతో టేస్టీగా ఉండే పాప‌డ్.. త‌యారీ ఇలా..!

Mango Papad : వేసవికాలం వచ్చిందంటే మనకు మార్కెట్లో మామిడి పండ్లు దర్శనమిస్తాయి. మామిడి పండ్లతో వివిధ రకాల వంటలను తయారు చేసుకొని తింటుంటారు. ఈ క్రమంలోనే కొందరు జ్యూస్ లు, పచ్చడిలు చేసుకుంటారు. అయితే ఈ మామిడి పండ్లతో పాపడ్ తయారుచేసుకుని తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ మ్యాంగో పాపడ్ తినడానికి పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టపడుతుంటారు. మరి మ్యాంగో పాపడ్ ఏవిధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

మ్యాంగో పాప‌డ్ త‌యారీకి కావలసిన పదార్థాలు..

బాగా పండిన మామిడికాయ గుజ్జు – ఒక కప్పు, చక్కెర – అర కప్పు, నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి – టేబుల్ స్పూన్.

Mango Papad recipe in telugu make in this method
Mango Papad

మ్యాంగో పాప‌డ్ తయారీ విధానం..

ముందుగా నెయ్యిని మూడు పెద్ద ప్లేట్లకు రాసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులోకి మామిడి గుజ్జు, పంచదార వేసుకొని చిన్న మంటపై బాగా కలియబెడుతూ ఉండాలి. ఈ మిశ్రమంలో నీరు వేయకుండా ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడేవరకు కలియబెడుతూ ఉండాలి. ఈ విధంగా ఈ మిశ్రమంలో మిరియాల పొడి వేసి మిశ్రమం మొత్తం దగ్గరకు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్ట‌వ్ ఆఫ్ చేసిన వెంటనే ఈ మిశ్రమాన్ని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లలో వేసి ప్లేట్ మొత్తం సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత ఈ మిశ్రమం చల్లారగానే దీనిని ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో అద్భుతంగా రుచి ఉంటుంది.

Editor

Recent Posts