Shruti Haasan : మా ఇద్ద‌రికీ ఆ విధంగా పెళ్లి జ‌రిగింది.. తేల్చి చెప్పిన శృతి హాస‌న్ బాయ్ ఫ్రెండ్‌..!

Shruti Haasan : స్టార్ హీరోయిన్ శృతి హాస‌న్‌కు ఈ మ‌ధ్య సినిమాలు త‌క్కువే అయ్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఈమె ఈ మ‌ధ్యే రెండు తెలుగు సినిమా ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకుంది. ప్ర‌భాస్‌తో క‌లిసి స‌లార్ అనే సినిమాలో న‌టిస్తుండ‌గా.. బాల‌కృష్ణ‌, గోపీచంద్ మ‌లినేని మూవీలో ఈమెను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే ఈమె ఎక్కువ‌గా ముంబైకే ప‌రిమితం అయిపోయింది. అందుకు కార‌ణం కూడా ఉంది. త‌న బాయ్ ఫ్రెండ్ శంత‌ను హ‌జారిక వ‌ల్లే ఈమె ముంబైలో ఎక్కువగా నివ‌సిస్తోంది.

Shruti Haasan boy friend Santanu Hazarika told that creatively they married
Shruti Haasan

అయితే శృతిహాస‌న్‌తో త‌న‌కు ఉన్న రిలేష‌న్‌షిప్‌పై శంత‌ను హ‌జారిక తాజాగా స్పందించాడు. స్వ‌తహాగా ఓ డూడుల్ ఆర్టిస్ట్ అయిన హ‌జారిక ద‌క్షిణ ముంబైలో ఓ ఆర్ట్ ఎగ్జిబిష‌న్‌ను ప్ర‌స్తుతం నిర్వ‌హిస్తున్నాడు. అందులో భాగంగానే దాన్ని ప్ర‌మోట్ చేసుకునే ప‌నిలో ప‌డ్డాడు. అయితే క‌రోనా వ‌ల్ల చాలా నెలల పాటు ఎగ్జిబిష‌న్స లేక ఖాళీగా ఉన్నాన‌ని.. అయిన‌ప్ప‌టికీ రోజూ గంట‌ల త‌ర‌బ‌డి డ్రాయింగ్స్ వేసేవాడిన‌ని తెలిపాడు.

ఇక శృతి హాస‌న్‌తో ఉన్న రిలేష‌న్‌షిప్‌పై కూడా అత‌ను స్పందించాడు. ప్ర‌స్తుతం ఇద్ద‌రం రిలేష‌న్ షిప్‌లో ఉన్న మాట నిజ‌మే. అయితే మాకు క్రియేటివిటీ ప‌రంగా జోడీ కుదిరింది. అందువ‌ల్ల క్రియేటివ్‌గా ఇద్ద‌రికీ పెళ్ల‌యిపోయిన‌ట్లే అని తెలిపాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను త‌మ మ‌ధ్య ఉన్న రిలేష‌న్‌షిప్ గురించి ఈ విధంగా ఓపెన్ అయ్యాడు. అయితే శృతి, తాను గంట‌ల త‌ర‌బ‌డి గ‌దిలో గ‌డుపుతామ‌నే విష‌యాన్ని కూడా తెలియ‌జేశాడు. ఈ క్ర‌మంలోనే శంత‌ను హజారిక కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Editor

Recent Posts