Sai Pallavi : తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. ఈమె సినిమాల్లో ఎలాంటి గ్లామర్ షో చేయదు. అలాగే ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్స్‌లోనూ నటించదు. తాను ఎలా ఉందో అలాగే అందరికీ కనిపించాలని ఆమె కోరుకుంటుంది. అందుకనే ఆమెను అభిమానించేవారు చాలా మందే ఉన్నారు. సాయిపల్లవికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆమె డ్యాన్స్ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. ఆమె డ్యాన్స్ కోసమే ఆమె సినిమాలను చూస్తారంటే అతిశయోక్తి కాదు. అయితే సాయిపల్లవి ఈ మధ్య వార్తల్లో కనిపించడం లేదు.
ఈమధ్యే సాయిపల్లవి శర్వానంద్ సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైంది. అక్కడ దర్శకుడు సుకుమార్ ఆమెను లేడీ పవన్ కల్యాణ్‌గా పోల్చారు. దీంతో ఆమె పేరు మారుమోగిపోయింది. అయితే ఆ తరువాత సాయిపల్లవి వార్తల్లో కనిపించడం లేదు. దీంతో సడెన్ గా ఆమె ఎందుకు అదృశ్యం అయిపోయింది ? అంటూ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలోనూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
సాయిపల్లవి చివరిసారిగా నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించి అలరించింది. ఆమె తరువాతి సినిమా విరాటపర్వం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నా అనేక కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఈ మూవీ నెట్ ఫ్లిక్స్‌లో నేరుగా రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ చిత్ర యూనిట్ వాటిని ఖండించింది. దీంతో విరాటపర్వం సినిమా విడుదల ఆగిపోయింది. ఈ ఒక్క సినిమా తప్ప సాయిపల్లవికి ప్రస్తుతం చేతిలో సినిమాలు ఏమీ లేవనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఈమె గురించి వార్తలు రాకపోవడం ఫ్యాన్స్‌ను విచారానికి గురి చేస్తోంది.