Samantha : అక్కినేని నాగచైతన్య, సమంతలు విడిపోయి ఆరు నెలలు అవుతోంది. గతేడాది అక్టోబర్ నెల ప్రారంభంలో వీరు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో యావత్ ప్రేక్షక లోకం నివ్వెరపోయింది. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా ఉన్న ఈ జంట ఎందుకు విడిపోయిందో ఎవరికీ అర్థం కాలేదు. వీరి విడాకుల నిర్ణయం ఎంతో మందికి నచ్చలేదు. ఈ క్రమంలోనే విడాకుల అనంతరం వీరు ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు.
అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సమంత తనకు పెళ్లి సమయంలో చైతన్య నుంచి వచ్చిన అన్ని బహుమతులను వెనక్కి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పెళ్లి సమయంలో సమంత ధరించిన నాగచైతన్య బామ్మ చీరను తిరిగి వారికే ఆమె అప్పగించినట్లు సమాచారం. ఆ పెళ్లి చీరను తిరిగి సమంత.. నాగచైతన్యకే ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే పెళ్లి సందర్భంగా అక్కినేని ఇంటి నుంచి ఆమెకు ఇచ్చిన కొన్ని బహుమతులను కూడా సమంత వెనక్కి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య ఈ మధ్యే థాంక్ యూ అనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయగా.. ఇందులో చైతూకు జోడీగా రాశిఖన్నా హీరోయిన్‌గా నటించింది. అలాగే లాల్ సింగ్ చడ్డా అనే బాలీవుడ్ మూవీలోనూ త్వరలో చైతన్య కనిపించనున్నాడు. ప్రస్తుతం చైతూ అమెజాన్ ప్రైమ్ తెరకెక్కిస్తున్న దూత అనే హార్రర్ థ్రిల్లర్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఈ మధ్యే చైతూ కన్‌ఫామ్ చేశాడు.