Spider : మన ఇళ్లల్లో సాధారణంగా సాలె పురుగులను చూస్తూ ఉంటాం. అవి మనకు ఎటువంటి హాని చేయవు. కానీ కొందరికి వాటిని చూస్తే చాలా భయంగా ఉంటుంది. ఈ భయాన్ని అరాక్నోపోబియా లేదా స్పైడర్ ఫోబియా అంటారు. అయితే సాలె పురుగులను ఇంటి లోపలికి రాకుండా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పుదీనా వాసన సాలె పురుగులకు నచ్చదు. ఇంటి లోపలికి సాలె పురుగులు రాకుండా ఉండాలంటే ఒక బాటిల్‌లో నీళ్లు, పుదీనా ఆకుల రసం కలిపి ఇంటి లోపల స్ప్రే చేయాలి. దీంతో సాలె పురుగులు లోపలికి రావు. ఇంట్లో చక్కని పరిమళం వస్తుంది. అయితే అర లీటర్ నీళ్లలో 30 ఎంఎల్ మేర పుదీనా ఆకుల రసం కలిపి స్ప్రే చేస్తే మంచిది. దీంతో సాలె పురుగులు రాకుండా చూసుకోవచ్చు.
2. వెనిగర్ తో మనకు చాలా ఉపయోగాలు కలుగుతాయి. వెనిగర్‌ను చల్లితే సాలె పురుగులు రావు. అందుకు గాను ఒక గ్లాస్ నీటిలో 2 టీస్పూన్ల వెనిగర్ కలిపి ఆ మిశ్రమాన్ని బాటిల్‌లో పోసి స్ప్రే చేయాలి. దీంతో సాలె పురుగులు పోతాయి.
3. ఇళ్లల్లో పిల్లులను పెంచుకుంటే సాలె పురుగులను రాకుండా అడ్డుకుంటాయి.
4. నిమ్మరసం కూడా సాలెపురుగులను దూరంగా ఉంచుతుంది. దీన్ని కూడా నీళ్లలో కలిపి ఇంట్లో చల్లవచ్చు. దీంతో సాలె పురుగుల నుంచి విముక్తి లభిస్తుంది.