Samantha : ఒక్క సినిమాకు స‌మంత తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ?

Samantha : ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ల‌లో స‌మంత ఒక‌రు. ర‌ష్మిక మందన్న‌, పూజా హెగ్డెలు కూడా ఈ జాబితాకు చెందుతారు. అయితే వీరిలో ఎవ‌రి దారి వారిదే. ఒక్కొక్క‌రు ఒక్కో ర‌కంగా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారు. ఇక తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం స‌మంత ఒక్క సినిమాకు భారీగా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే పూజా హెగ్డె ఒక్క సినిమాకు రూ.3.50 కోట్లను రెమ్యున‌రేష‌న్‌గా తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. అలాగే ర‌ష్మిక మంద‌న్న కూడా ఒక్క సినిమాకు రూ.3 కోట్ల దాకా వ‌సూలు చేస్తుంద‌ని తెలుస్తోంది.

Samantha taking huge amount of remuneration for one movie
Samantha

ఇక స‌మంత విష‌యానికి వ‌స్తే ఆమె ప్ర‌స్తుతం న‌టిస్తున్న య‌శోద అనే పాన్ ఇండియా సినిమాకు రూ.3 కోట్ల మొత్తం తీసుకుంటుంద‌ని సమాచారం. ఈ సినిమాను థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌డం విశేషం. ఇక ఈ సినిమా బ‌డ్జెట్ రూ.30 కోట్లు అని తెలుస్తోంది.

య‌శోద త‌రువాత స‌మంత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, త‌మిళ న‌టుడు విజ‌య్‌తో క‌లిసి వ‌రుస సినిమాలు చేయ‌నుంది. మైత్రి మూవీ మేక‌ర్స్ విజ‌య్ హీరోగా, స‌మంత హీరోయిన్‌గా ఓ మూవీని తెర‌కెక్కించ‌నున్నారు. అందులో న‌టించేందుకు కూడా స‌మంత రూ.3 కోట్లు డిమాండ్ చేసింద‌ని స‌మాచారం. ఇక పుష్ప సినిమాలో ఈమె ఊ అంటావా.. అనే ఐట‌మ్ సాంగ్‌లో న‌టించినందుకు రూ.1.50 కోట్ల మొత్తం అందుకుంద‌ని తెలుస్తోంది. దీంతో స‌మంత త‌న రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ఏమాత్రం త‌గ్గ‌డం లేద‌ని స‌మాచారం.

స‌మంత ప్ర‌స్తుతం న‌టించిన కాతు వాకుల రెండు కాద‌ల్ అనే త‌మిళ మూవీ ఏప్రిల్‌లో విడుద‌ల కానుండ‌గా.. శాకుంత‌లం అనే పౌరాణిక చిత్రం కూడా వ‌రుస‌లో ఉంది. ఈ మూవీ ప్రస్తుం గ్రాఫిక్స్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా కూడా విడుద‌ల కానుంది.

Editor

Recent Posts