Naga Chaitanya : సమంతతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన అనంతరం నాగచైతన్య ఫుల్ బిజీగా మారారు. చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. లవ్ స్టోరీ సినిమాతో మరో హిట్ కొట్టిన చైతూ సంక్రాంతికి బంగార్రాజుగా వచ్చి అలరించారు. ఇక ఈ మధ్యే థాంక్ యూ అనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అలాగే దూత అనే ఓ హార్రర్ థ్రిల్లర్ సిరీస్ చేస్తున్నాడు. ఇది అమెజాన్ ప్రైమ్‌లో రానుంది. ఇలా చైతన్య ఇటీవలి కాలంలో పలు వరుస సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉన్నారు.
ఇక నాగచైతన్య తాజాగా మరో కొత్త వ్యాపారం ప్రారంభించారు. ఆయన ఫుడ్ బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యారు. షోయూ పేరిట ఓ క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించారు. తన స్నేహితుడు వరుణ్ త్రిపురనేనితో కలిసి ఈ బిజినెస్‌ను ఆయన మొదలు పెట్టారు. ఈ విషయాన్ని చైతూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. షోయూ ద్వారా ఆసియాలోని ప్రముఖ వంటకాలను హైదరాబాద్ వాసులకు అందివ్వనున్నారు.
కాగా తన సొంత బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ రూపొందించిన ఓ వీడియోను చైతూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే షోయూను ప్రారంభించేందుకు ముందుగా ఆయన చేసిన వర్కవుట్ తాలూకు వివరాలను ఆయన ఫ్యాన్స్‌కు చెప్పారు. అయితే సమంత ఇప్పటికే సాకి అనే వస్త్ర బ్రాండ్ ద్వారా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే చైతూ కొత్తగా ఫుడ్ బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యాడు. మరి ఇందులో సక్సెస్ అవుతాడా.. లేదా.. అన్నది చూడాలి..!