Samantha : జ‌ల‌పాతాల ద‌గ్గ‌ర స‌మంత సంద‌డి..!

Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ స‌మంత ఈ మ‌ధ్య‌కాలంలో సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. అందులో భాగంగానే త‌న‌కు సంబంధించిన ప్ర‌తి కార్య‌క్ర‌మానికి చెందిన ఫొటోల‌ను ఆమె షేర్ చేస్తోంది. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా ఈమె వెకేష‌న్స్‌కు వెళ్తూ సంద‌డి చేస్తోంది. మొన్నీ మ‌ధ్యే త‌న స్నేహితురాలు శిల్పారెడ్డితో క‌లిసి ఈమె గోవా ట్రిప్ వేసింది. ప్ర‌స్తుతం మ‌ళ్లీ ఈమె వెకేష‌న్ కు వెళ్లిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Samantha vacation at Athirappilly Water Falls
Samantha

స‌మంత తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జ‌ల‌పాతాల వ‌ద్ద ఉన్న ఫొటోను షేర్ చేసింది. అందులో ఎవ‌రికోస‌మో ఎదురు చూస్తున్న‌ట్లుగా ఆమె పోజులు ఇచ్చింది. పింక్ క‌ల‌ర్ డ్రెస్ వేసుకుని ఈ ఫొటోల్లో క‌నిపించింది. దీంతో స‌మంత షేర్ చేసిన ఈ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఈమె అతిర‌ప్పిల్లి జ‌ల‌పాతాల వ‌ద్ద ఉన్న‌ట్లు సోష‌ల్ ఖాతాను చూస్తే తెలుస్తుంది. ఈ వాట‌ర్ ఫాల్స్ కేర‌ళ‌లోని త్రిసూర్ జిల్లాలో ఉన్నాయి. ఇక్క‌డి జ‌ల‌పాతాలు సంద‌ర్శకుల‌కు క‌నువిందు చేస్తుంటాయి.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే స‌మంత ప్ర‌స్తుతం కాతు వాకుల రెండు కాద‌ల్ అనే త‌మిళ మూవీలో న‌టించింది. ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తిలు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. అలాగే శాకుంత‌లం, య‌శోద అనే మ‌రో రెండు సినిమాల్లోనూ స‌మంత న‌టిస్తోంది.

Admin

Recent Posts