వినోదం

ముద్దులొలికే ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..? ప్రస్తుతం ఇతడు టాలీవుడ్ హీరో..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ట్రెండ్‌ నడుస్తూ ఉంటుంది. సినీ తారలు నెట్టింట త్రోబ్యాక్‌ పిక్‌ పోస్ట్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. సినిమా ప్రేక్షకులు కూడా తమ అభిమాన హీరోలు, హీరోయిన్లను సోషల్ మీడియాలో ఫాలో అవుతూ తమ అభిమాన తారలు ఏం ఫొటోలు షేర్‌ చేశారా అని ఎదురు చూస్తూ ఉంటారు.

తార‌లు కూడా తమ అభిమానుల కోసం రోజూ ఏదొక అప్‌డేట్‌ ఇస్తూనే ఉంటారు. అలాగే వారి డైలీ యాక్టివిటీ, ఫొటోషూట్లు కూడా నెట్టింట పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది సెలబ్రిటీలు వారి త్రో బ్యాక్‌ పిక్స్‌ ని షేర్‌ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇలానే ఇప్పుడు ఓ బుడ్డోడి పిక్ ఒకటి నెట్టింట బాగా వైరల్‌ అవుతోంది. ఆ పిక్‌లో ఉన్న చిన్నవాడు ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్‌ ఉన్న హీరోలలో ఒకరు.

sandeep kishan childhood photo viral

ముద్దులొలికే ఈ చిన్నోడు తెలుగులోనే కాదు అటు తమిళ్‌లో కూడా చాలా సినిమాలు చేశాడు. హిందీ సినిమా, వెబ్‌ సిరీస్‌లో కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అటు లవ్లీ క్యారెక్టర్లు చేస్తూనే ఇటు గ్యాంగ్‌స్టర్‌ క్యారక్టర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడైతే సిక్స్ ప్యాక్‌, కండలు తిరిగిన బాడీతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్‌ బిజీగా కూడా ఉన్నాడు. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు, తమిళంలో రెండు సినిమాలు నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ యంగ్‌ హీరోకి లేడీ ఫ్యాన్స్ లోనూ మంచి క్రేజ్‌ ఉంది. ఇప్పుడు ఇతను హీరోనే కాదు.. ప్రొడ్యూసర్‌ కూడా. ఏంటి ఇంకా గుర్తుపట్టలేదా ? అతను మరెవరో కాదు.. యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌.

2010లో ప్రస్థానం సినిమాతో సందీప్‌ కిషన్‌ టాలీవుడ్లో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. నెగెటివ్‌ రోల్‌తో కెరీర్‌ ప్రారంభించినా కూడా.. ఆ తర్వాత మంచి హీరో పాత్రలు సందీప్‌ కిషన్‌ని వెతుక్కుంటూ వచ్చాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తెలుగులోనే కాకుండా తమిళ్‌లో కూడా చాలా సినిమాలలో నటించాడు. హిందీ సూపర్‌ హిట్‌ వెబ్‌ సిరీస్‌ ఫ్యామిలీ మ్యాన్‌లో కూడా సందీప్ నటించాడు. హిందీలో షోర్ ఇన్ ది సిటీ అనే సినిమాలో కూడా సందీప్‌ కిషన్‌ నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్‌లోనూ సందీప్‌ కిషన్ కి చాలామంది అబిమానులు ఉన్నారు.

Admin

Recent Posts