Set Dosa : హోట‌ల్స్‌లో లభించే సెట్ దోశ‌ల‌ను ఇలా చేయాలి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Set Dosa : సెట్ దోశ‌.. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వివిధ ర‌కాల దోశ‌ల‌ల్లో ఇవి కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ఎక్కువ‌గా హోట‌ల్స్ లో ల‌భిస్తూ ఉంటాయి. సెట్ దోశలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ సెట్ దోశ‌ల‌ను మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. త‌రుచూ ఒకేర‌కం దోశ‌లు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, స్పాంజీ లాగా మెత్త‌గా ఉండే ఈ సెట్ దోశ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో… ఇప్పుడు తెలుసుకుందాం.

సెట్ దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మిన‌ప‌ప్పు – అర క‌ప్పు, బియ్యం – ఒక‌టిన్న‌ర క‌ప్పు, మెంతులు – ఒక టేబుల్ స్పూన్, అటుకులు – అర క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – త‌గినన్ని.

Set Dosa recipe make them like in hotels
Set Dosa

సెట్ దోశ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో మిన‌ప‌ప్పు, బియ్యం, మెంతులు, అటుకులు వేసి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి 4 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత పిండిని రాత్రంతా పులియ‌బెట్టాలి. పిండి చ‌క్క‌గా పులిసిన త‌రువాత ఇందులో ఉప్పు, నీళ్లు పోసి క‌ల‌పాలి. ఈ పిండి దోశ పిండి కంటే కొద్దిగా గ‌ట్టిగా ఉండేలా చూసుకోవాలి. త‌రువాత స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక నూనె వేసి ఉల్లిపాయ‌తో రుద్దాలి. త‌రువాత గంటెతో పిండిని తీసుకుని పెనం మీద వేసుకోవాలి. ఈ పిండిని దోశ మాదిరి స్ప్రెడ్ చేసుకోవ‌ద్దు. ఊత‌ప్పంలాగా వేసుకోవాలి. త‌రువాత అంచుల వెంబ‌డి నూనె వేసుకుని మూత పెట్టాలి.అలాగే ఈ దోశ‌ను సెట్ దోశ‌ను మ‌రో వైపు తిప్పి కాల్చుకోకూడ‌దు. ఒక‌వైపు పెనం మీద మ‌రోవైపు ఆవిరి మీద కాల్చుకోవాలి. దోశ ఒక‌వైపు ఎర్ర‌గా కాలిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని కొబ్బ‌రి చ‌ట్నీ, సాంబార్ తో స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సెట్ దోశ‌లు త‌యార‌వుతాయి. మెత్త‌గా, మృదువుగా రుచిగా ఉండే ఈ స్పాంజ్ దోశ‌ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts