Shruti Haasan : గత రెండున్నర సంవత్సరాల నుంచి కరోనా వల్ల ఎంతో మంది చనిపోయారు. దానికి చిన్న, పెద్ద.. పేద, ధనిక.. అన్న తేడా లేదు. ఎంతో మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు చాలా మందికి కరోనా సోకింది. కొందరు చనిపోయారు కూడా. అయితే కొందరు సెలబ్రిటీలకు మాత్రం పదే పదే కరోనా వస్తోంది. తాజాగా శృతి హాసన్ మరోమారు కరోనా బారిన పడింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఆమె ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతోంది.
అయితే శృతి హాసన్ ప్రస్తుతం కోవిడ్ నుంచి కోలుకుంటుండగా.. తాజాగా ఆమె ఒక ఫొటోను పోస్ట్ చేసింది. అందులో ఆమె చాలా దారుణంగా కనిపిస్తోంది. అసలు గుర్తు పట్టరాకుండా మారిపోయింది. బాగా నీరసించి కనిపిస్తోంది. కరోనా సోకితే ఎంతలా మారిపోతారో.. ఈమె అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. కాగా ఆమె ఈ ఫొటోను షేర్ చేయగా.. దాన్ని చూసి అందరూ షాకవుతున్నారు. శృతి హాసన్ ఇలా బలహీనంగా మారిపోయిందేమిటి ? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే కరోనా వల్లే ఆమె ఇలా మారిందని తెలుస్తోంది. ఇక ఈ ఫొటోతో పాటు ఆమె ఒక కామెంట్ కూడా పెట్టింది. తాను కరోనా వల్ల ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని.. ఏం చేయాలో తోచడం లేదని కామెంట్ పెట్టింది. దీంతో ఆమె పోస్ట్ వైరల్ అవుతోంది. ఇక ఈమె బాలకృష్ణతో కలిసి ఆయన 107వ సినిమాలో నటిస్తుండగా.. ప్రభాస్ తో కలిసి సలార్ అనే సినిమాలో నటిస్తోంది.