Sreemukhi : ప్రస్తుత తరుణంలో బుల్లితెరపై సందడి చేస్తున్న యాంకర్స్ చాలా మంది సినిమాల్లోనూ అవకాశాలను దక్కించుకుంటున్నారు. తరువాత సినిమాల్లో రాణిస్తున్నారు. యాంకర్ అనసూయ ఇందుకు ఉదాహరణ అని చెప్పవచ్చు, ఈమె మొదట్లో యాంకర్‌గా రాణించింది. తరువాత సినిమాల్లో నటించి బిజీ అయింది. ఇక మరో యాంకర్‌గా రాణిస్తున్న శ్రీముఖి కూడా అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తోంది.
అయితే వాస్తవానికి శ్రీముఖి మొదట్లో సినిమాల్లో నటించింది. తరువాత యాంకర్‌గా వచ్చింది. అప్పట్లో ఈమె జులాయి సినిమాలో నటించింది. తరువాత నేను శైలజ, జెంటిల్‌మెన్, ప్రేమ్ ఇష్క్ కాదల్, బాబు బాగా బిజీ సినిమాల్లో నటించింది. తరువాత యాంకర్‌గా కొనసాగుతోంది. నటిగా కంటే ఈమె యాంకర్‌గానే బాగా పాపులర్ అయింది. అయితే శ్రీముఖికి ఓ బడా ప్రొడ్యూసర్ హీరోయిన్‌గా ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ఈమధ్యే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగా శ్రీముఖి ఆయనను తనకు హీరోయిన్ చాన్స్ కావాలని అడిగిందట. దీంతో ఆయన సరే అని ఒప్పుకున్నారట. ఈ క్రమంలోనే ఈ వార్త హల్‌చల్ చేస్తోంది. మరి యాంకర్‌గా రాణిస్తున్న శ్రీముఖి హీరోయిన్ అవుతుందో.. లేదో.. చూడాలి.