వినోదం

Simha Movie : బాల‌య్య‌కు జోష్ ఇచ్చిన సింహా మూవీ.. పెట్టింది రూ.18 కోట్లు.. వ‌చ్చింది ఎంతో తెలిస్తే షాక‌వుతారు..!

Simha Movie : నంద‌మూరి బాల‌కృష్ణ అంటేనే ఫ్యాక్ష‌న్ సినిమాల‌కు పెట్టింది పేరు. గ‌తంలో ఆయ‌న ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్‌లో తీసిన అనేక మూవీలు హిట్ అయ్యాయి. అయితే అదే కోవ‌లో వ‌చ్చింది సింహా మూవీ. కానీ ఇందులో ఇత‌ర ఫ్యాక్ష‌న్ సినిమాల్లో మాదిరిగా సుమోల‌తో ఛేజింగ్‌లు లేవు. తొడ‌లు కొట్ట‌డాలు కూడా లేవు. ఫ్యాక్ష‌న్ మూవీ అంటే ఇలా కూడా తీయ‌వ‌చ్చు అని ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను సింహా మూవీని వెరైటీగా తీశారు. దీంతో ఆయ‌న శైలి ప్రేక్ష‌కుల‌కు న‌చ్చింది. సినిమాకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఫ‌లితంగా సింహా మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌న‌క వ‌ర్షం కురిపించింది.

2004 నుంచి 2010 వ‌ర‌కు బాల‌య్య వ‌రుస‌గా చేసిన 7 మూవీలు ఫ్లాప్ అయ్యాయి. విజ‌యేంద్ర‌వ‌ర్మ‌, అల్ల‌రి పిడుగు, వీర‌భ‌ద్ర‌, మ‌హార‌థి, ఒక్క మ‌గాడు, పాండురంగ‌డు, మిత్రుడు.. ఇలా 7 సినిమాలు తీశాక 2010లో వ‌చ్చింది సింహా మూవీ. దీనికి బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌కుడు. అప్ప‌టికే ఆయ‌న ఎన్నో మూవీల‌కు అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. బాల‌య్య‌తో సింహా మూవీ మొద‌టిసారి తీయ‌డం. అయిన‌ప్ప‌టికీ బోయ‌పాటిపై బాల‌య్య న‌మ్మ‌కం ఉంచారు. ఈ క్ర‌మంలోనే వినూత్న త‌ర‌హాలో ఆయ‌న సీన్ల‌ను తెర‌కెక్కించారు. ముఖ్యంగా బాల‌య్య త‌న డైలాగ్‌ల‌తోనే ప్ర‌త్య‌ర్థుల‌ను భ‌య‌పెట్ట‌డం, దుర్మార్గుల‌ను విచ‌క్ష‌ణా ర‌హితంగా శిక్షించ‌డం.. వంటి అంశాలు ప్రేక్ష‌కులు న‌చ్చ‌డంతోపాటు కొత్త‌గా అనిపించాయి. దీంతో సినిమా ఊహించ‌ని రీతిలో హిట్ అయింది.

simha movie budget and collections

ఇక ఈ మూవీలో బాల‌య్య డ్యుయ‌ల్ రోల్‌లో యాక్ట్ చేశారు. రెండు పాత్ర‌ల్లోనూ ఆయ‌న అద‌ర‌గొట్టేశారు. న‌య‌న‌తార‌, స్నేహా ఉల్లాల్ హీరోయిన్లుగా చేశారు. ఈ మూవీకి గాను రూ.18 కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌గా ఏకంగా రూ.31 కోట్ల షేర్ వ‌చ్చింది. దీంతో బాక్సాఫీస్ రికార్డులు బ‌ద్ద‌ల‌య్యాయి. ఈ మూవీతో వ‌చ్చిన ఆర్య‌న్ రాజేష్ బురిడీ, శ‌ర్వానంద్ ప్ర‌స్థానం, ప్ర‌భాస్ డార్లింగ్‌, 1940 ఒక గ్రామం, రామ రామ కృష్ణ కృష్ణ వంటి మూవీలు సింహా ప్ర‌భంజ‌నం ముందు నిల‌బ‌డ‌లేక‌పోయాయి. అయితే వాటిల్లో ప్ర‌భాస్ డార్లింగ్ మూవీ కాస్త ఫ‌ర్వాలేద‌నిపించింది. ఇక ఈ మూవీకి గాను బాల‌య్య‌కు ఉత్త‌మ న‌టుడిగా నంది అవార్డు రాగా, ఝాన్సీకి ఉత్త‌మ హాస్య‌న‌టిగా, చ‌క్రికి ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా నంది అవార్డులు వ‌చ్చాయి. ఇలా సింహా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావ‌నే చెప్పాలి. ఈ మూవీతో బాల‌య్య కెరీర్ మ‌ళ్లీ ఉన్న‌త స్థాయికి చేరుకుంది. త‌రువాత ఆయ‌న న‌టించిన అనేక మూవీలు హిట్ అయ్యాయి.

Admin

Recent Posts