ఆధ్యాత్మికం

ఇంట్లో సిరి సంపదలు కలగాలంటే ఉసిరితో ఇలా చేయాల్సిందే..!

సాధారణంగా మన ఇంట్లో సుఖసంతోషాలతో కలిగి ఉండి లక్ష్మి దేవి అనుగ్రహం కలగాలంటే ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మికి పూజలు నిర్వహిస్తారు. మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగాలంటే లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించాలని పండితులు చెబుతున్నారు. మహాలక్ష్మి అనుగ్రహం కలగాలంటే ప్రతి రోజూ ఉసిరితో ఈ విధంగా చేయాలి.

మహాలక్ష్మికి ఉసిరికాయ అంటే ఎంతో ఇష్టం. అమ్మవారి అనుగ్రహం మనపై కలగాలంటే అమ్మవారికి ఇష్టమైన ఉసిరిపై ప్రతి రోజూ దీపం పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ముఖ్యంగా మహాలక్ష్మికి ఇష్టమైన శుక్రవారం రోజున ఈ విధంగా చేయడం ఎంతో ముఖ్యం.

do like this with amla for luck and wealth

శుక్రవారం సాయంత్రం ఉసిరి దీపం పెట్టి అమ్మవారిని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అదేవిధంగా ఉసిరి హారతి ఇవ్వడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన దరిద్రం తొలగిపోవడమే కాకుండా, ప్రశాంత వాతావరణం కలుగుతుంది. ఉసిరికాయలను శ్రీచక్రానికి నైవేద్యంగా సమర్పించి దానిని ప్రసాదంగా ఇతరులకు పెట్టడం వల్ల ఆ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts