food

నోరూరించే సింపుల్ టేస్టీ ఆలూ జీరా ఎలా తయారు చేయాలో తెలుసా ?

చపాతి, పరోటా వంటి వాటిలోకి ఆలూ జీరా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ ఎంతో టేస్టీగా, తొందరగా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన ఆలూ జీరా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…

కావలసిన పదార్థాలు

ఐదు బంగాళాదుంపలు, 2 స్పూన్ల జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, తగినంత ఉప్పు, 1స్పూన్ కారం, కొత్తిమీర తురుము, 4 పుదీనా ఆకులు, టేబుల్ స్పూన్ నెయ్యి.

simple and tasty aloo jeera recipe in telugu

తయారీ విధానం

ముందుగా బంగాళదుంపలను కుక్కర్లో మెత్తగా ఉడకబెట్టుకొని వాటిని క్యూబ్ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసి గోధుమ వర్ణంలోకి వచ్చే వరకూ వేయించాలి. జీలకర్ర ఒక ప్లేట్ లో తీసుకొని తరువాత ధనియాలను కూడా బాగా వేయించాలి. తరువాత వీటిని మెత్తని పొడిగా చేయాలి.

స్టవ్ పై మరో కడాయిని పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసి మిగిలిన జీలకర్ర వేసి అందులో బంగాళదుంప ముక్కలను వేయాలి.వీటిలోకి ముందుగానే తయారు చేసుకున్న జీలకర్రపొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి బాగా కలియబెట్టాలి.రెండు నిమిషాల పాటు సిమ్లో వేయించుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిపై కొత్తిమీర తురుము, పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకోవాలి. వేడి వేడిగా ఉన్న ఆలూ జీరా చపాతీ లేదా రోటీతో కలిపి తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది.

Admin

Recent Posts