lifestyle

Chanakya Niti : ఇలాంటి ఇళ్ల‌లో అస‌లు ఎప్పుడూ సంతోషం ఉండ‌దు.. అలాగే సంప‌ద క‌ల‌గ‌దు..!

Chanakya Niti : ఆచార్య చాణ‌క్యుడి నీతి శాస్త్రాన్ని అనుస‌రించిన వారికి ఎల్ల‌ప్పుడూ శుభాలు క‌లుగుతాయని, వారు ఎప్పుడూ సుల‌ఖ సంతోషాల‌తో ఉంటార‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. చాణ‌క్యుడి నీతి శాస్త్రం మ‌న‌కు అనేక విష‌యాల‌ను చెబుతుంది. ఇవి అన్ని కూడా మ‌న‌కు మంచి చేసేవే. ఆచార్య చాణ‌క్యుడి నీతిశాస్త్రం మ‌న‌కు కొన్ని గృహాల గురించి కూడా చెబుతుంది. ఈ గృహాల్లో సానుకూల శ‌క్తి ఎప్పుడూ ఉండ‌దు. ఇలాంటి ఇళ్ల‌ల్లో నివ‌సించ‌కూడ‌దని కూడా నీతి శాస్త్రం చెబుతుంది. ఇటువంటి ఇళ్ల‌ల్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎన‌ర్జీ ఉండ‌దు. అటువంటి ఇళ్ల‌ల్లో నివ‌సించిన వారికి శ్రేయస్సు, ఆనందం కూడా ఉండ‌దు.

వాస్త‌వానికి ఇటువంటి ఇళ్ల‌ను చాణ‌క్యుడు శ్మ‌శాన వాటిక‌ల మ‌రియు ఆ ఇళ్ల‌ల్లో నివ‌సించిన వారిని మ‌ర‌ణించిన వారిగా ప‌రిగ‌ణిస్తాడు. ఆచార్య చాణక్యుడి ప్ర‌కారం ఎటువంటి ఇళ్ల‌ను స‌శ్మాన వాటిక‌లుగా ప‌రిగ‌ణించాలి అలాగే వీటి వెనుక ఉన్న కార‌ణాల గురించి తెలుసుకుందాం. చాణక్య నీతి ప్ర‌కారం కొన్ని ఇళ్లల్లో ఎప్పుడూ కూడా సానుకూల ప‌నులు జ‌ర‌గ‌వు. అటువంటి ఇళ్ల‌ల్లో సానుకకూల శ‌క్తి ఉండ‌దు. ఆ ఇళ్ల‌ల్లో ఉండే వారికి ఐశ్వ‌ర్యం కూడా ఉండ‌దు. బ్ర‌హ్మ‌ణుల పాదాలు క‌డిగిన నీళ్ల‌తో బుర‌ద‌మ‌యం కానీ ఇళ్ల‌ను స‌శ్మాన వాటిక‌లుగా ప‌రిగ‌ణించాలని నీతి శాస్త్రం చెబుతుంది. అలాగే చాణ‌క్య నీతి శాస్త్రం ప్రకారం స్వాహా, స్వ‌ధా అనే ప‌దాలు ఉచ్చ‌రించ‌ని ఇళ్లు కూడా శ్మ‌శాన వాటిక లాంటిది.

these is no happiness in this type of houses according to chanakya

అలాగే శుభ కార్యాలు లేదా వేదాలు, మ‌త గ్రంథాలు ప‌ఠించ‌ని ఇళ్లులు కూడా శ్మ‌శాన వాటిక‌ల వ‌లె ప‌రిగ‌ణించ‌బ‌డ‌తాయి. ఆచార్య చాణ‌క్యుడి ప్ర‌కారం , పూజ‌లు జ‌రిగే ఇళ్ల‌ల్లో మంత్రాలు ప్ర‌తిధ్వ‌నించ‌బ‌డ‌తాయి. అలాంటి ఇళ్ల‌ల్లో ఎల్ల‌ప్పుడూ సానుకూల శ‌క్తి ఉంటుంది. ఇలాంటి ప్ర‌దేశాన్నే ఇల్లు అంటారు. ఇటువంటి గృహాల్లో ఉన్న వారు ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉంటారు. వారు చేసే ప్ర‌తి పనిలో కూడా విజ‌యం సాధిస్తారని ఆచార్య చాణ‌క్యుడి నీతిశాస్త్రం చెబుతుంది.

Admin

Recent Posts