Soft Paneer : పాలతో చేసే పదార్థాల్లో పనీర్ కూడా ఒకటి. పనీర్ ను మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పనీర్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే మన పోషకాలు మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో ఎంతో దోహదపడుతుంది. పనీర్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటారు. చాలా మంది పనీర్ తో చేసే వంటకాలను ఎంతో ఇష్టంగా తింటారు. సాధారణంగా మనం పనీర్ ను బయట నుండి కొనుగోలు చేస్తూ ఉంటాము. బయట కొనే పని లేకుండా ఈ పనీర్ ను మనం అదే స్టైల్ లో ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బయట లభించే విధంగా గట్టిగా ఉండే పనీర్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కటి పాలు – ఒక లీటర్, నీళ్లు – పావు కప్పు, వెనిగర్ – 2 టేబుల్ స్పూన్స్.
పనీర్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో పాలను పోసి వేడి చేయాలి. పాలు మరిగి పొంగు వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు గిన్నెలో నీటిని తీసుకుని అందులో వెనిగర్ ను వేసి కలపాలి. ఇప్పుడు ఈ వెనిగర్ నీటిని కొద్ది కొద్దిగా పాలల్లో వేసి కలపాలి. వెనిగర్ వేసి కలపగానే పాలు విరిగిపోతాయి. ఇప్పుడు జల్లిగిన్నెలో క్లాత్ ను ఉంచి పాలను వడకట్టాలి. నీరంతా పోయి పాలు విరుగుడు మిగిలిన తరువాత దీనిని మనకు నచ్చిన ఆకారంలో సర్దుకుని పైన బరువును ఉంచాలి. దీనిని ఒకటి లేదా రెండు గంటల పాటు అలాగే ఉంచాలి. నీరంతా పోయి పనీర్ గట్టిగా అయిన తరువాత ముక్కలుగా కట్ చేసుకుని వండుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో గట్టిగా ఉండే పనీర్ తయారవుతుంది. దీనిని తయారు చేసుకున్న మూడు రోజులల్లోనే వాడుకోవాలి. ఇలా ఇంట్లోనే బయట లభించే విధంగా గట్టిగా ఉండే పనీర్ ను తయారు చేసుకోవచ్చు.