Bread Kaja : స్వీట్ తినాల‌నిపిస్తే బ్రెడ్‌తో అప్ప‌టిక‌ప్పుడు ఇలా చేసి తినండి.. ఎంతో బాగుంటుంది..!

Bread Kaja : మ‌నం బ్రెడ్ తో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే అప్ప‌టిక‌ప్పుడు చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ విధంగా బ్రెడ్ తో చేసే తీపి వంట‌కాల్లో బ్రెడ్ కాజా కూడా ఒక‌టి. బ్రెడ్ తో చేసే ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. అల‌గే ఇన్ స్టాంట్ గా ఈ స్వీట్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. బ్రెడ్ తో త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు అప్ప‌టిక‌ప్పుడు దీనిని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇన్ స్టాంట్ గా చేసుకోగ‌లిగే ఈ బ్రెడ్ కాజాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్ కాజా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బ్రెడ్ స్లైసెస్ – 6, పంచ‌దార – అర క‌ప్పు, నీళ్లు – పావు క‌ప్పు, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా.

Bread Kaja recipe in telugu make in this method
Bread Kaja

బ్రెడ్ కాజా త‌యారీ విధానం..

ముందుగా బ్రెడ్ కు ఉండే అంచుల‌ను తీసేసి వాటిని త్రిభుజాకారంలో కట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో పంచ‌దార‌, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచ‌దార క‌రిగిన త‌రువాత జిగురుగా అయ్యే వ‌ర‌కు మ‌రో 3 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బ్రెడ్ స్లైసెస్ ను వేసి మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకోవాలి. త‌రువాత వీటిని తీసి పంచ‌దార పాకంలో వేసుకోవాలి. వీటిని రెండు పైపులా పాకంలో డిప్ చేసుకుని ఒక నిమిషం పాటు ఉంచి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత వీటిపై త‌రిగిన డ్రై ఫ్రూట్స్ ను, కొద్దిగా యాల‌కుల పొడిని చ‌ల్లుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ కాజా త‌యార‌వుతుంది. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు లేదా ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు బ్రెడ్ తో ఇలా స్వీట్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసిన బ్రెడ్ కాజాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts