Sonam Kapoor : త‌ల్లి కాబోతున్నట్లు తెలిపిన సోన‌మ్ క‌పూర్‌..!

Sonam Kapoor : బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సోన‌మ్ క‌పూర్ త‌న న‌ట‌న‌తో, అందంతో ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. త‌న తండ్రి అనిల్‌ క‌పూర్ వార‌స‌త్వంతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన‌ప్ప‌టికీ త‌నకంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కాగా మే 2018 లో బిజినెస్ మ్యాన్ ఆనంద్ అహుజాతో సోన‌మ్ క‌పూర్ వివాహం అంగ‌రంగ వైభంగా జ‌రిగింది.

Sonam Kapoor  said that she is pregnant
Sonam Kapoor

వివాహం త‌రువాత కూడా సోన‌మ్ త‌న న‌ట‌న‌ను కొన‌సాగించింది. తాజాగా ఈ అమ్మ‌డు త‌ను త‌ల్లి కాబోతున్నాను అనే విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించింది. భ‌ర్త ఆనంద్ అహుజా తో క‌లిసి త‌న బేబీ బంప్ ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానుల‌తో షేర్ చేసుకుంది. వీటితో పాటుగా నాలుగు చేతులు నిన్ను పెంచ‌డానికి, రెండు గుండెలు నీతో న‌డ‌వ‌డానికి, ఒక ఫ్యామిలీ నీతో ప్రేమ‌ను పంచుకోవ‌డానికి సిద్దంగా ఉన్నాయి, నా కోసం మ‌నం వేచి ఉండ‌లేము అని సోన‌మ్ త‌న ఇన్ స్టా అకౌంట్ లో రాసుకొచ్చింది.

కాగా సోన‌మ్ చివ‌రిగా 2019 లో దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా విడుద‌లైన‌ జోయా ఫ్యాక్ట‌ర్ సినిమాలో న‌టించింది. 2020లో అనిల్ క‌పూర్‌, అనురాగ్ క‌శ్య‌ప్ క‌లిసి న‌టించిన ఎకె వ‌ర్సెస్ ఎకె సినిమాలో అతిథి పాత్ర‌లో న‌టించింది.

Editor

Recent Posts