Broad Beans : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో చిక్కుడు కాయలు ఒకటి. ఇవి చవకగానే లభిస్తాయి. కానీ కొందరు వీటిని తినేందుకు ఇష్టపడరు. అయితే వీటిలో ఉన్న పోషకాలు.. వీటి ద్వారా అందే లాభాలు తెలిస్తే.. ఇకపై ఎవరూ చిక్కుడు కాయలను విడిచిపెట్టకుండా తినేస్తారు. వీటిని పోషకాలకు గనిగా చెప్పవచ్చు. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చిక్కుడు కాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే అధిక బరువు తగ్గుతారు. శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రావు.
చిక్కుడు కాయలను తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా నిరోధించవచ్చు. వీటిని తింటే షుగర్ లెవల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి. అలాగే హైబీపీ తగ్గుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది.
చిక్కుడు కాయల్లో ఐరన్, కాల్షియం అధికంగా ఉంటాయి. అందువల్ల రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. అలాగే కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది.
చిక్కుడు కాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతోపాటు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. దీంతో క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు. కనుక చిక్కుడు కాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే..!