Sorakaya Masala Kura : సొర‌కాయ‌తో మ‌సాలా కూర‌ను ఇలా చేస్తే.. ఇష్టం లేని వారు కూడా మొత్తం లాగించేస్తారు..

Sorakaya Masala Kura : సొర‌కాయ‌. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. దీనిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చాలా మంది ఈ సొర‌కాయ‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ సొర‌కాయ‌ను కూడా ఆహారంగా తీసుకోవాల‌ని దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం ఆరోగ్య ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చని నిపుణులు చెబుతున్నారు. సొర‌కాయతో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. సొర‌కాయ‌తో చేసుకోద‌గిన కూర‌ల్లో సొర‌కాయ మ‌సాలా కూర ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా స‌లుభం. సొర‌కాయ‌తో మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

సొర‌కాయ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

సొర‌కాయ – 1 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌ది), త‌రిగిన ట‌మాటాలు – 2, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Sorakaya Masala Kura recipe in telugu very tasty make in this way
Sorakaya Masala Kura

మ‌సాలాపేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండుకొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, సాజీరా – ఒక టీ స్పూన్, యాల‌కులు – 3, ల‌వంగాలు – 5, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్.

సొర‌కాయ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన ప‌దార్థాల‌న్నీ వేసి దోర‌గా వేయించుకోవాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిగా చేసుకోవాలి. త‌రువాత అర టీ గ్లాస్ నీటిని పోసి మెత్త‌ని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ‌, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. ఇవి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు బాగా వేయించాలి. త‌రువాత సొర‌కాయ‌ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిని మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. సొరకాయ ముక్క‌లు ఉడికిన త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్ ను వేసుకోవాలి. త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు వేసి క‌ల‌పాలి.

త‌రువాత దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత ఒక గ్లాస్ నీళ్లు లేదా త‌గిన‌న్ని నీళ్లు పోసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆప్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సొర‌కాయ మ‌సాలా కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటి, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సొర‌క‌యాతో త‌ర‌చూ చేసే కూర‌ల కంటే ఈ విధంగా చేసిన మ‌సాలా కూర చాలా రుచిగా ఉంటుంది. దీనినిఅంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts