Spicy Mushroom Fry : పుట్ట‌గొడుగుల‌తో ఘాటుగా ఉండే ఫ్రై.. ఇలా చేయ‌వ‌చ్చు..!

Spicy Mushroom Fry : సాధారణంగా మాంసాహారం తింటే ఎన్నో పోషక విలువలు మన శరీరానికి అందుతాయని మనకు తెలుసు. కానీ మాంసాహారం తినే వారికి అదే స్థాయిలో పోషకాలు అందాలంటే ఎంతో ముఖ్యమైన ఆహారాలలో మష్రూమ్స్ ఒకటి . ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ మష్రూమ్స్ ను తినడానికి ఎంతో మంది ఇష్టపడుతుంటారు. ఈ క్ర‌మంలోనే వీటితో ఎన్నో ర‌కాల వంట‌కాల‌ను సైతం చేస్తుంటారు. పుట్ట‌గొడుగుల‌తో చేసే ఏ వంట‌కం అయినా స‌రే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే వీటితో ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పుట్ట‌గొడుగుల ఫ్రై త‌యారీకి కావలసిన పదార్థాలు..

మష్రూమ్స్ – 500 గ్రాములు, వెల్లుల్లి – ఒకటి, కొత్తిమీర – తగినంత, ఉప్పు – రుచికి సరిపడా, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – చిటికెడు, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, లవంగాలు – 3, గరం మసాల – త‌గినంత‌, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, నూనె తగినంత.

Spicy Mushroom Fry recipe in telugu make in this method
Spicy Mushroom Fry

పుట్ట‌గొడుగుల ఫ్రై తయారీ విధానం..

ముందుగా మష్రూమ్స్ ను నీటిలో కడిగి బాగా శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి కొద్దిగా నూనె వేయాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత పోపు దినుసులు వేసి రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఎరుపు వర్ణంలోకి మారిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్‌ వేసి బాగా కలియబెట్టాలి. మష్రూమ్స్ నూనెలో 2 నిమిషాలు వేగాక‌ రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి మూత పెట్టాలి.

రెండు నిమిషాల తర్వాత మరొక సారి కలియబెట్టాలి. అవసరమైతే ఒక చిన్న గ్లాస్ నీటిని వేసి తక్కువ మంటపై బాగా ఉడికించాలి. ఈలోగా వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు, ధనియాల పొడి, కొత్తిమీర మిశ్రమాన్ని రోటిలో బాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఐదు నిమిషాల‌ తర్వాత మష్రూమ్స్ బాగా మెత్తగా అయిన తరువాత కారం పొడి వేసి తక్కువ మంట పైనే రెండు నిమిషాలు వేయించాలి. రెండు నిమిషాల తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకొన్న వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించాలి. ఈ విధంగా చేయటం వల్ల పచ్చి వాసన రాకుండా ఉంటుంది. రెండు నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టి స్టౌ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన స్పైసీ మష్రూమ్ ఫ్రై తయారైనట్లే. వేడి వేడిగా ఉండే ఈ మష్రూమ్ ఫ్రై ని చపాతీ లేదా పరోటాతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Share
Editor

Recent Posts