Chintha Chiguru : చింత చిగురుతో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే తెచ్చుకుని తింటారు..!

Chintha Chiguru : మ‌న‌కు మార్కెట్‌లో అనేక ర‌కాల ఆకుకూర‌లు అందుబాటులో ఉన్నాయి. పాల‌కూర‌, చుక్క కూర‌, గోంగూర‌, తోట‌కూర.. ఇలా వివిధ ర‌కాల ఆకుకూర‌ల‌ను మ‌నం త‌ర‌చూ వండుకుని తింటుంటాం. అయితే ఇవే కాక మ‌న‌కు సీజ‌న‌ల్‌గా ల‌భించే కొన్ని ఆకులు కూడా ఉన్నాయి. అవే.. చింత చిగురు ఆకులు. లేత చింత ఆకులు లేదా చింత చిగురును ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గా విక్ర‌యిస్తుంటారు. మ‌న‌కు గ్రామీణ ప్రాంతాల్లో చింత చిగురు పుష్క‌లంగా ల‌భిస్తుంది. అయితే చింత చిగురు మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. దీన్ని తిన‌డం వ‌ల్ల అనేక పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే ప‌లు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. చింత చిగురును తింటే ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌లేరియా వంటి జ్వ‌రాలు వ‌చ్చిన వారు చింత చిగురు ర‌సం తాగుతుంటే త్వ‌ర‌గా కోలుకుంటారు. జ్వ‌రం త‌గ్గుతుంది. ఈ ఆకుల వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతో వ్యాధులు త్వ‌ర‌గా త‌గ్గుతాయి. అలాగే ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి బ‌య‌ట ప‌డ‌తారు. చింత చిగురును తిన‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. టైప్ 1 లేదా 2 ఏ డ‌యాబెటిస్ అయినా స‌రే త‌గ్గుతుంది. అలాగే ప‌చ్చ కామెర్లు వ‌చ్చిన వారు ఈ ఆకులను తింటుంటే ఎంత‌గానో గుణం క‌నిపిస్తుంది. త్వ‌ర‌గా కామెర్ల నుంచి కోలుకుంటారు.

Chintha Chiguru benefits in telugu must take in this season
Chintha Chiguru

గాయాలు అయిన వారు చింత చిగురు పేస్ట్‌ను రాస్తున్నా లేదా ఈ ఆకుల‌ను తింటున్నా త్వ‌ర‌గా గాయాల నుంచి కోలుకుంటారు. పుండ్లు కూడా త‌గ్గుతాయి. చ‌ర్మ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. కొందరికి విట‌మిన్ సి లోపించ‌డం వ‌ల్ల దంతాలు, చిగుళ్ల నుంచి ర‌క్తం కారుతుంది. కానీ చింత ఆకుల‌ను తింటే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతో విట‌మిన్ సి కూడా పుష్క‌లంగా ల‌భిస్తుంది.

పాలిచ్చే త‌ల్లులు చింత ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల పాలు బాగా ప‌డ‌తాయి. అలాగే స్త్రీలు రుతు స‌మ‌యంలో క‌లిగే నొప్పుల నుంచి, అధిక ర‌క్తస్రావం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. దంతాల నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. ఇలా చింత చిగురు వ‌ల్ల మ‌నం ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక ఇది ల‌భించిన‌ప్పుడు దీన్ని తిన‌డం మ‌రిచిపోకండి. దీంతో ప‌ప్పు లేదా ప‌చ్చడి చేసుకోవ‌చ్చు. లేదా చికెన్‌, మ‌ట‌న్‌, రొయ్య‌లు వంటివి క‌లిపి వండుకోవ‌చ్చు. ఎలా వండినా చింత చిగురు ప‌డితే ఆ కూర రుచే వేరేగా ఉంటుంది. దీన్ని అన్నంలో క‌లిపి తింటే ఒక ప‌ట్టు ప‌డ‌తారు. కూర‌ను ఏమీ మిగ‌ల్చ‌రు. అంద‌రూ ఇష్టంగా తింటారు. దీంతో రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రెండింటినీ పొంద‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts