Sponge Dosa : మెత్త‌గా దూదిలా ఉండే స్పాంజ్ దోశ‌లు.. అప్ప‌టిక‌ప్పుడు ఇలా చేసుకోవ‌చ్చు..!

Sponge Dosa : మ‌న‌లో చాలా మంది దోశ‌ల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని మ‌నం త‌ర‌చూ ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటాము. దోశ‌ల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అయితే కొన్ని సార్లు దోశ పిండిని త‌యారు చేసుకునే స‌మ‌యం అంతగా ఉండ‌దు. అలాంట‌ప్పుడు మ‌నం ఇన్ స్టాంట్ గా స్పాంజ్ దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వచ్చు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. కేవ‌లం 20 నిమిషాల్లోనే మ‌నం ఈ స్పాంజ్ దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇన్ స్టాంట్ గా స్పాంజ్ దోశ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

స్పాంజ్ దోశ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

బొంబాయి ర‌వ్వ – ఒక క‌ప్పు, నీళ్లు – ఒక క‌ప్పు, అటుకులు – అర క‌ప్పు, పెరుగు – పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, బేకింగ్ పౌడ‌ర్ – అర టీ స్పూన్.

Sponge Dosa you can make them very easily
Sponge Dosa

స్పాంజ్ దోశ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ర‌వ్వ‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో నీళ్లు పోసి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత మ‌రో గిన్నెలో అటుకుల‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో నీళ్లు పోసి చ‌క్క‌గా క‌డ‌గాలి. త‌రువాత ఇందులో పెరుగు కొద్దిగా నీళ్లు పోసి క‌లుపుకోవాలి. త‌రువాత అటుకుల‌ను, అలాగే ర‌వ్వ‌ను 15 నిమిషాల పాటు నాన‌బెట్టుకోవాలి. త‌రువాత ఒక జార్ లో నాన‌బెట్టుకున్న ర‌వ్వ‌తో పాటు అటుకుల‌ను కూడా వేసుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, బేకింగ్ పౌడ‌ర్ వేసి క‌లుపుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి దోశ పిండిలా క‌లుపుకోవాలి.

ఇప్పుడు స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక త‌గినంత పిండిని తీసుకుని దోశ లాగా వేసుకోవాలి. అయితే ఈ దోశ‌ను మ‌రీ ప‌లుచ‌గా కాకుండా కొద్దిగా మందంగా ఉండేలా వేసుకోవాలి. దోశ కొద్దిగా కాలిన త‌రువాత నూనె వేసి కాల్చుకోవాలి. దోశ ఒక వైపు కాలిన త‌రువాత మ‌రో వైపుకు తిప్పుకుని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో మెత్త‌గా ఉండే స్పాంజ్ దోశ త‌యార‌వుతుంది. దీనిని ట‌మాట చ‌ట్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఉద‌యం పూట స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు స్పాంజ్ దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts