food

Raw Coconut Laddu : ఈ ల‌డ్డూలు ఎంత ఆరోగ్య‌క‌రం అంటే.. రోజుకు ఒక‌టి తింటే.. ఏ రోగాలు రావు..!

Raw Coconut Laddu : మ‌నం అప్పుడ‌ప్పుడూ ప‌చ్చి కొబ్బ‌రిని కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. దీంతో మ‌నం ఎక్కువ‌గా ప‌చ్చ‌డిని త‌యారు చేస్తూ ఉంటాం. చాలా మంది ప‌చ్చి కొబ్బ‌రిని నేరుగా తింటూ ఉంటారు. దీనిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. త‌ర‌చూ ప‌చ్చి కొబ్బ‌రిని తిన‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. గుండె సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. చ‌ర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి ని మెరుగుప‌ర‌చ‌డంలో, జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచ‌డంలో కూడా ప‌చ్చి కొబ్బ‌రి ఉప‌యోగ‌ప‌డుతుంది.

చాలా మంది ప‌చ్చి కొబ్బ‌రిలో బెల్లాన్ని క‌లిపి ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటారు. ఈ ల‌డ్డూల‌ను మ‌రింత రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా వీటిలో డ్రై ఫ్రూట్స్ ను వేసి కూడా చేసుకోవ‌చ్చు. రుచిగా ఉండ‌డంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ ల‌డ్డూల‌ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

take raw coconut laddu for many benefits

డ్రైఫ్రూట్ కొబ్బ‌రి ల‌డ్డూ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చి కొబ్బ‌రి తురుము – మూడు క‌ప్పులు, పంచ‌దార – ఒక క‌ప్పు, బెల్లం తురుము – రెండు క‌ప్పులు, బాదం ప‌ప్పు – పావు క‌ప్పు, జీడిప‌ప్పు – పావు క‌ప్పు, పిస్తా ప‌ప్పు – పావు క‌ప్పు, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – చిటికెడు.

డ్రైఫ్రూట్ కొబ్బ‌రి ల‌డ్డూ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో డ్రైఫ్రూట్స్ ను వేసి దోర‌గా వేయించి చ‌ల్లగా అయిన త‌రువాత జార్ లో వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. అదే క‌ళాయిలో నెయ్యి వేసి నెయ్యి క‌రిగిన త‌రువాత కొబ్బ‌రి తురుమును, బెల్లం తురుమును, పంచ‌దార‌ను వేసి మ‌ధ్య‌స్థ మంట‌పై 10 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించుకోవాలి. త‌రువాత యాల‌కుల పొడి, ఉప్పు, ముందుగా మిక్సీ పట్టుకున్న డ్రైఫ్రూట్స్ మిశ్ర‌మాన్ని వేసి బాగా క‌లిపి ద‌గ్గ‌ర పడే వ‌ర‌కు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మం గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడే మ‌న‌కు కావ‌ల్సిన ప‌రిమాణంలో ల‌డ్డూలుగా చేసుకోవాలి. వీటిని మూత ఉండే డ‌బ్బాలో నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. రోజుకి ఒక‌టి లేదా రెండు చొప్పున వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ అందుతాయి.

Admin

Recent Posts