Tattoo According To Zodiac Sign : మీ రాశి ప్ర‌కారం మీరు ఎక్క‌డ టాటూ వేయించుకోవాలో తెలుసా..?

Tattoo According To Zodiac Sign : ఒకప్పుడు అంటే ఏమోగానీ నేటి ఆధునిక మోడ్ర‌న్ యుగంలో టాటూ అనేది ఒక ఫ్యాష‌న్ అయిపోయింది. దాన్ని చాలా మంది ప్రెస్టీజ్ ఇష్యూ కోసం కూడా వేయించుకుంటున్నారు. అయితే టాటూ ఎలా వేయించుకున్నా దాంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు అని భావిస్తేనే వేసుకోవాలి. లేదంటే చ‌ర్మం ఇన్‌ఫెక్ష‌న్‌కు గుర‌వుతుంది. స‌రే.. టాటూ గురించి జాగ్ర‌త్త‌లు తీసుకునేవారు తీసుకుంటారు. అది వేరే విష‌యం. కానీ నిజానికి టాటూను శ‌రీరంలో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వేసుకోకూడ‌ద‌ట‌. అవును, మీరు విన్నది క‌రెక్టే. ఎవ‌రైనా త‌మ రాశి ప్ర‌కారం నిర్దిష్ట‌మైన భాగంలోనే టాటూ వేయించుకోవాల‌ట‌. దీంతో అదృష్టం క‌ల‌సి వ‌స్తుంద‌ని ఆస్ట్రాల‌జీ చెబుతోంది. మ‌రి ఏయే రాశుల వారు త‌మ రాశిని బ‌ట్టి ఏ భాగంలో టాటూ వేయించుకుంటే మంచి జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామా..!

మేష‌ రాశి వారు త‌మ శ‌రీరంలో వీపుపై టాటూ వేయించుకోవాలి. వీపుపై ఎక్క‌డైనా స‌రే టాటూ వేయించుకోవ‌చ్చు. దీంతో ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. అలాగే వృష‌భ రాశి వారు త‌మ చేతి మ‌ణిక‌ట్టుపై టాటూ వేయించుకుంటే మంచిది. మిథున రాశి వారు మెడ‌పై టాటూ వేయించుకోవాల్సి ఉంటుంది. క‌ర్కాట‌క రాశి వారు కాలి పిక్క‌ల‌పై టాటూ వేయించుకోవాలి. సింహ రాశి వారు భుజాల‌పై టాటూ వేయించుకోవాలి.

Tattoo According To Zodiac Sign know in which place for it
Tattoo According To Zodiac Sign

కన్య రాశి వారు చేతి వేళ్ల‌పై టాటూలు వేయించుకుంటే మంచిది. తులా రాశి వారు మోచేయి, చేయిపై టాటూల‌ను వేయించుకోవాలి. వృశ్చిక రాశి వారు మ‌డ‌మ‌ల‌పై టాటూలు వేసుకోవాల్సి ఉంటుంది. ధ‌నుస్సు రాశి వారు తొడ‌ల‌పై టాటూ వేయించుకోవాలి. మ‌క‌ర రాశి వారు ఛాతిపై టాటూ వేసుకోవాలి. కుంభ రాశి రాశి వారు పాదాల‌పై టాటూ వేయించుకోవాలి. మీన రాశి వారు చెవుల వెనుక భాగంలో టాటూ వేయించుకుంటే మంచిది.

Editor

Recent Posts