తెలంగాణలో ఒక స్కూల్ టీచర్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీసీటీవీ లో విద్యార్థిని టీచర్ కొట్టినట్లు కనపడుతోంది. తెలంగాణలో ఉన్న కొత్తగూడెం పట్టణంలో గొల్లగూడెం మానస వికాస్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ తర్వాత ఇంటికి వెళ్లి దిగులుగా కూర్చున్న బాలుడుని తల్లిదండ్రులు ఏమైందని అడగడంతో బాలుడు స్కూల్లో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకి చెప్పాడు.
స్కూలుకు వెళ్లి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసారు. యజమాన్యం సీసీ టీవీ ఫుటేజ్ ఓపెన్ చేయాలని తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో స్కూల్ యాజమాన్యం ఫుటేజ్ చూపించింది. అది చూసి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
అయితే, బాబుకి ఎప్పుడూ ఎదో ఒక హెల్త్ ప్రాబ్లెమ్ వస్తుందని, ఫిట్స్ కూడా వస్తాయని బాబు తల్లి చెప్పారు. మాములుగా ఒక దెబ్బ వేయాలి కానీ వాతలు తేలిపోయేటట్టు సార్ కొట్టడం మంచి పద్ధతి కాదని తల్లి అన్నారు. హోమ్ వర్క్ చేయలేదని, హోంవర్క్ పూర్తి చేయలేదన్న కారణంతోనే విద్యార్థిని చితకబాదారు అని తల్లి చెప్పారు.