Bheemla Nayak : పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం రిలీజ్ అవుతున్న శుభ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం పవన్ అభిమానులకు బంపర్ న్యూస్ చెప్పింది. సినిమా రిలీజ్ అయిన నాటి నుంచి 2 వారాల పాటు రాష్ట్రంలోని థియేటర్లలో రోజుకు 5 ఆటలను ప్రదర్శించుకునే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఫిబ్రవరి 25న మూవీ విడుదల అయిన నాటి నుంచి మార్చి 11వ తేదీ వరకు తెలంగాణలోని థియేటర్లలో భీమ్లానాయక్ సినిమాను రోజుకు 5 ఆటలు వేయనున్నారు.
ఇక భీమ్లా నాయక్ సినిమాలో పవన్‌తోపాటు రానా మరో కీలకపాత్రను పోషించగా.. పవన్ పక్కన నిత్య మీనన్, రానా పక్కన సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. సముద్రఖని మరో కీలకపాత్రను పోషించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా.. ఇప్పటికే ఈ మూవీలోని పాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
భీమ్లా నాయక్ సినిమాను మళయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించారు. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికే విడుదల కావల్సి ఉంది. కానీ కరోనా వల్ల వాయిదా వేశారు. ఎట్టకేలకు ఈ సినిమా మరో 3 రోజుల్లో విడుదలవుతుండడం పవన్ ఫ్యాన్స్‌కు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.