Dimple Hayathi : ఖిలాడి సినిమాతో డింపుల్ హయతి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. గతంలో టాలీవుడ్‌లో ఏ హీరోయిన్ చేయని రీతిలో డింపుల్ హయతి అందాలను ఆరబోసింది. ఖిలాడి ప్రెస్ మీట్‌కు ఈమె వేసుకు వచ్చిన డ్రెస్ చర్చనీయాంశంగా మారింది. కేవలం ప్రెస్ మీట్‌కే ఇంతలా షో చేయాలా.. అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇక ఖిలాడి మూవీ అంతగా హిట్ అవకపోయినా.. డింపుల్ హయతికి మాత్రం గ్లామర్ షో పరంగా మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఈ అమ్మడిని హీరోయిన్ గా ఎంపిక చేసేందుకు దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే ఈమెకు గోపీచంద్ పక్కన నటించే చాన్స్ వచ్చిందని తెలిసింది. అయితే దీనిపై అధికారిక వివరాలు ఇంకా ప్రకటించలేదు.
అయితే సినిమా చాన్స్‌లు రాకపోయినా సరే.. డింపుల్ హయతి ఒక రేంజ్‌లో కేక పెట్టిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె అందచందాలను చూసి అయినా ఎవరో ఒకరు చాన్స్ ఇవ్వకపోతారా.. అని అంటున్నారు. మరి ఈమెకు ముందు ముందు ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి.