Thamara Ginjala Kura : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తామ‌ర గింజ‌ల‌తో ఇలా కూర చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Thamara Ginjala Kura : మ‌నం ఫూల్ మ‌ఖ‌నీని కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. ఫూల్ మ‌ఖ‌నీలో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మనం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఎముకల‌ను దృడంగా ఉంచ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, కాలేయంలో మ‌లినాల‌ను తొల‌గించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ఫూల్ మ‌ఖ‌నా మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. ఈ ఫూల్ మ‌ఖ‌నాతో మ‌నం ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూరను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అన్నం, చ‌పాతీ, పుల్కా ఇలా దేనితోనైనా ఈ కూర‌ను తిన‌వ‌చ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ ఫూల్ మ‌ఖ‌నా మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఫూల్ మ‌ఖ‌నా మ‌సాలా కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఫూల్ మ‌ఖ‌నా – ఒక క‌ప్పు, నూనె – 3 టీ స్పూన్స్, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, జీడిప‌ప్పు – 10, త‌రిగిన ట‌మాటాలు – 1, ఎండు కొబ్బ‌రి పొడి – 2 స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చిన్న‌గా తరిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, నీళ్లు – ఒక క‌ప్పు, చిలికిన పెరుగు – 2 స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Thamara Ginjala Kura recipe in telugu make in this method
Thamara Ginjala Kura

ఫూల్ మ‌ఖ‌నా మ‌సాలా కూర త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ఒక టీస్పూన్ నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఫూల్ మ‌ఖానాను వేసి వేయించాలి. తరువాత వీటిని గిన్నెలోకి తీసుకుని అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్క‌లు వేసి మెత్త‌బ‌డే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత‌జీడిప‌ప్పు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, ఎండు కొబ్బ‌రి వేసి మూత పెట్టి వేయించాలి. ట‌మాట ముక్క‌లు ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి.

త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ప‌చ్చిమిర్చి వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ఉల్లిపాయ మిశ్ర‌మం వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉప్పు, ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ఫూల్ మ‌ఖనా వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఫూల్ మ‌ఖనా మ‌సాలా కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts