lifestyle

Bad Signs : ఇంట్లో ఇలా జ‌రుగుతుంటే.. ఇవి చెడు సంకేతాలు.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

Bad Signs : ప్రతి ఒక్కరు కూడా హాయిగా, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు ఇంట్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయితే మనకి ఏదైనా ఇబ్బంది కలగబోతోంది అంటే కచ్చితంగా దానికి ముందు సంకేతాలు కనపడుతూ ఉంటాయి. ఇవి కనక కనపడ్డాయి అంటే, చెడు సంకేతాలని మీరు తెలుసుకో వచ్చు. ఇంటి పైకప్పు మీద కానీ ఇంటి ఆవరణలో కానీ గుడ్లగూబ అరిచినట్టైతే కచ్చితంగా మీకు హాని కలగబోతుందని దానికి అర్థం.

ఇంట్లో రోళ్ళు తిరగబడకూడదు. అలానే ఇంట్లో రోళ్ళు పగలకూడదు. దీపము కొండి విరగకూడదు. ఇలాంటివి జరిగితే కష్ట నష్టాలు కలుగుతాయి. ఇంటి లోపలి భాగంలో తేనె పట్టు పట్టకూడదు. అలా పడితే కాపురంలో సుఖం ఉండదు. అలానే త్వరలో ఇల్లు అగ్నికి ఆహుతి అవుతుందని గ్రహించాల్సి వుంది. ఆ తరవాత ఏ ఇబ్బంది కలగకుండా తగిన శాంతి చేయించుకోవాలి.

these are bad signs if they happen beware

ఇంట్లో బాలబాలికలు సున్నాన్ని కానీ పసుపుని కానీ పారబోస్తే ఆ ఇంటి యజమాని అప్పులు పాలైపోతాడు. ఇంట్లో పిల్లలు మూత్ర విసర్జన చేస్తే ఇంట్లో కష్టాలు ఎదురవుతాయి. తల్లి కాలి ధూళి రేణువులు పిల్లలపై పడితే బిడ్డకి అసలు మంచిది కాదు. ఎప్పుడైనా అపశకునం ఎదురైతే ఆ పనిని ఆపేసి చేతులు, ముఖము, కాళ్లు కడుక్కుని తర్వాత ఇష్ట దైవాన్ని ప్రార్థించి మళ్లీ ప్రయత్నం చేయాలి.

బిడ్డ బ్రహ్మ రంధ్రానికి తల్లి యొక్క చనుమొనలు తగిలితే తల్లికి వ్యాధి కలుగుతుంది. ఇటువంటివి చెడు సంకేతాలుగా పరిగణించబడ్డాయి. పండితులు ఇటువంటి సంకేతాలు కనపడితే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఈ సంకేతాల‌ని మీరు గ్రహించి మసులుకుంటే కష్టాల నుండి గట్టెక్కచ్చు. అందుకే జరగబోయేవి మీరు ఇలా తెలుసుకుని జాగ్రత్త పడండి.

Admin

Recent Posts