lifestyle

మ‌నిషి ఆయువు తీరే ముందు కనిపించే సంకేతాలు ఇవే..!

పుట్టిన ప్ర‌తి జీవి చ‌నిపోక త‌ప్ప‌దు. అందులో మ‌నుషుల‌కు ఎలాంటి మిన‌హాయింపు లేదు. భూమిపై పుట్టిన ప్ర‌తి జీవి ఎప్పుడో ఒక సారి చ‌నిపోవాల్సిందే. కాక‌పోతే కొంద‌రు అర్థాంత‌రంగా త‌నువు చాలిస్తుంటారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే ఎవ‌రికైనా స‌రే ఆయువు ఉన్నంత వ‌ర‌కే జీవిస్తారు. అది ముగిస్తే య‌ముడు పాశం వేసి ప్రాణాల‌ను తీస్తాడు. అయితే మ‌రి ఆయువు తీరింది అనే విష‌యం మ‌న‌కు ఎలా తెలుస్తుంది.. ఏమైనా సంకేతాలు క‌నిపిస్తాయా.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయువు తీరింద‌ని చెప్పేందుకు మ‌న శ‌రీరంలో ప‌లు సంకేతాలు, ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ముఖ్యంగా శ‌క్తి స్థాయిలు పూర్తిగా త‌గ్గిపోతాయి. ప‌నిచేసేందుకు అస‌లు ఏమాత్రం శ‌క్తి ఉండ‌దు. తీవ్రమైన నీర‌సం, అల‌స‌ట ఉంటాయి. శ‌రీరం అంటేనే భారంగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు బ‌రువు దించుకుందామా.. అన్న‌ట్లుగా ఉంటుంది. మ‌ర‌ణం స‌మీపిస్తుంటే బీపీ, హార్ట్ రేట్‌, శ్వాస క్రియ స‌క్ర‌మంగా ఉండ‌వు. అసాధార‌ణ రీతిలో ఉంటాయి. పూర్తిగా పెర‌గ‌వ‌చ్చు లేదా త‌గ్గ‌వ‌చ్చు. అలాగే ఉష్ణోగ్ర‌త కూడా క్ష‌ణ క్ష‌ణానికి మారుతుంటుంది.

these signs will show before human death

మ‌ర‌ణం స‌మీపిస్తుంటే శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా ఉంటుంది. అలాగే గొంతులో నుంచి జీర లాంటి ఒక ధ్వ‌ని వినిపిస్తుంది. ఇది వ‌చ్చిందంటే ఆ మ‌నిషి కొన్ని గంట‌ల్లోనే చ‌నిపోతాడ‌ని అర్థం. మృత్యువు స‌మీపిస్తుంటే మ‌నిషి మాన‌సిక స్థితి దెబ్బ తింటుంది. స‌రిగ్గా ఆలోచించ‌లేడు. ఒక ర‌క‌మైన ప్ర‌పంచంలో ఉన్న‌ట్లు అనిపిస్తుంది. అలాగే ఎంతో ద‌గ్గ‌రి వారు, కుటుంబ స‌భ్యులు, అత్యంత చ‌నువుగా ఉండే వారిని సైతం గుర్తు ప‌ట్ట‌లేక‌పోతుంటారు. చావు స‌మీపిస్తుంటే ఆక‌లి ఉండ‌దు. దాహం అనిపించ‌దు. దీంతో బ‌రువు తీవ్రంగా త‌గ్గిపోతారు. చావు స‌మీపిస్తుంటే చ‌ర్మం రంగు, ఉష్ణోగ్ర‌త మారుతాయి. చ‌ర్మం పాలిపోయిన‌ట్లు క‌నిపిస్తుంది. క‌ళ ఉండ‌దు. ఉష్ణోగ్ర‌త త‌గ్గి చ‌ల్ల‌గా ఉంటుంది.

చావు స‌మీపించిన వారు ఎల్ల‌ప్పుడూ కోమాలో ఉన్న‌ట్లు ఉంటారు. క‌ళ్లు తెరిచి చూడ‌లేరు. అలాగే త‌మ‌కు య‌మ ధ‌ర్మ రాజు, యమ భ‌టులు, చ‌నిపోయిన వారు క‌నిపిస్తున్నార‌ని చెబుతారు. ఇలా ఆయువు తీరిన వారికి కొన్ని ర‌కాల సంకేతాలు క‌నిపిస్తాయి. దీన్ని బ‌ట్టి ఆయుష్షు తీరింద‌ని వారు త్వ‌ర‌లోనే చ‌నిపోతార‌ని అర్థం చేసుకోవాలి.

Admin

Recent Posts