technology

ఫెడ్ఎక్స్ కొరియర్ పేరుతో భారీ మోసం.. మాన‌సికంగా చాలా బాధ‌ని అనుభ‌వించిన జ‌ర్న‌లిస్ట్..

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఆఫర్ల పేరుతో ఆశ చూపించో, ఇతర మార్గాల్లో భయబ్రాంతులకు గురి చేసో విచ్చ‌ల విడిగా సామాన్య ప్రజల నుంచి డబ్బులు దోచేసుకుంటున్నారు. ఇప్పుడు ఫెడ్ఎక్స్ కొరియర్ పేరుతో భారీ మోసానికి పాల్పడుతున్నారు. మీ పేరు మీద డ్రగ్స్ బుక్ అయ్యిందని, మనీలాండరింగ్ జరిగిందంటూ భయపెట్టింది.. భారీ డబ్బుల్ని పోగేసుకుంటున్నారు.తాజ‌గా ఓ ఛానెల్ సీనియ‌ర్ అసిస్టెంట్ ఎడిట‌ర్ కూడా బొక్క బోల్తా ప‌డింది. ఫెడెక్స్ కొరియ‌ర్ నుండి కాల్ చేస్తున్నామ‌ని చెప్ప‌డంతో ఆమె వారి ప్ర‌శ్న‌లకి స్పందించింది. అయితే అవ‌త‌లి వ్య‌క్తి మీకు కొరియ‌ర్ వ‌చ్చింది అని చెప్ప‌గా, అప్పుడు ఆమె నేను కొరియర్ పంపలేదు. ఫేక్ కాల్స్ చేయడం ఆపండి అని పేర్కొంది.

అప్పుడు అత‌ను, “మేడమ్, ముంబై విమానాశ్రయంలో మీ కొరియర్ సీజ్ చేయబడింది అని అన్నాడు. దానిని ఆమె నవ్వుతూ బదులిచ్చి.. ఈ విషయం ఇంకెవరికైనా చెప్పండి.. నేను కొరియర్ పంపలేదు కాబట్టి ఎందుకు సీజ్ చేస్తారు? అని పేర్కొంది.అప్పుడు అత‌ను మీ కొరియర్ ముంబై నుండి తైవాన్‌కు పంపబడుతోంది. అనుమానాస్పద వస్తువులు కనుగొనబడ్డాయి, అందుకే దానిని స్వాధీనం చేసుకున్నారు. మీ ఆధార్ కార్డ్ దీనికి లింక్ చేయబడింది. మీపై ముంబై పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌బ‌డుతుంది అని అన్నాడు. అప్పుడు ముంబై పోలీసులతో మాట్లాడాలి. కొరియ‌ర్ డీటైల్స్ రాసుకోండి అని అన్నాడు. అప్పుడు వివరాలు వ్రాస్తున్నప్పుడు, NDMA అంటే ఏమిటి అని అన్నాడు. “అది డ్రగ్స్, మేడమ్. అందుకే మేము మిమ్మల్ని సంప్రదించాము. మీ ఆధార్ కార్డు తప్పు చేతుల్లోకి వెళ్లి ఉండవచ్చు అని చెప్పాడు.

this is how a journalist got cheated online

అప్పుడు “దయచేసి కాల్ బదిలీ చేయండి. నేను ముంబై పోలీసులతో మాట్లాడుతాను” అన్నాను. కాని త‌ర్వాత ఈ విష‌యంపై నాకు చాలా భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి .నేను 112కి కాల్ చేయగా, పోలీసులు త్వరగా వచ్చారు. వారు కూడా ఇది స్కామ్ అని ధృవీకరించారు మరియు సైబర్ క్రైమ్‌కు నివేదించమని లేదా పోలీసు స్టేషన్‌ను సందర్శించమని సలహా ఇచ్చారు. అయితే ఆ వ్య‌క్తితో కాల్ మాట్లాడే స‌మ‌యంలో నేను ఎంత మాన‌సిక హింసని అనుభ‌వించానో చెప్ప‌లేను. ఇలాంటి మోసాల గురించి ఎప్పుడూ ఇతరులను హెచ్చరించే నన్ను, గంటల తరబడి మానసికంగా హింసించారు. డిజిటల్‌గా అరెస్టయ్యారనే భావన మరియు భయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇతరులను అప్రమత్తంగా ఉండమని హెచ్చరించడానికి నేను ప్ర‌త్యేకంగా లెట‌ర్ రాస్తున్నాను అని జ‌ర్న‌లిస్ట్ పేర్కొంది.

Sam

Recent Posts