Anushka Shetty : పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క. సూపర్ మూవీ హిట్ అవ్వడంతో వరుసగా స్టార్ హీరోల సరసన నటించింది స్వీటీ. అనుష్క శెట్టి ఓ వైపు టాప్ హీరోలతో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఆ తర్వాత బాహుబలి, భాగమతి లాంటి సినిమాలు స్వీటీ ఇమేజ్‌ను మరింత పెంచాయి. ఇటీవల పూర్తిగా సినిమాలు తగ్గించిన అనుష్క.. చివరిగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో వచ్చిన నిశ్శబ్ధం మూవీలో నటించింది. ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయి ఫర్వాలేదు అనిపించింది. ఆ తరువాత వెండి తెరపై కనిపించలేదు అనుష్క.
అనుష్క ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లకు పైనే అవుతోంది. 40 ఏళ్లు వయసున్న స్వీటీ మాత్రం ఇంకా వివాహ బంధంలోకి అడుగుపెట్టలేదు. అయితే ఆమె పెళ్లిపై ఎప్పుడూ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో ఉందంటూ అప్పట్లో పుకార్లు వచ్చాయి. అంతేకాదు వాళ్ళిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. అయితే ఈ విషయంపై అటు ప్రభాస్, ఇటు అనుష్క ఈ వార్తలపై స్పందించలేదు.
మరోవైపు అనుష్క తల్లిదండ్రులు కూడా ఆమెకు త్వరగా వివాహం చేసేందుకు తొందర పడుతున్నా అనుష్క మాత్రం ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ పెళ్లి వాయిదా వేస్తూ వస్తుందట. అనుష్క ఇలా పెళ్లికి వాయిదా వేయడానికి గల కారణం ఆమె జాతకంలో దోషం ఉండటం అని తల్లిదండ్రులు దోష పరిహారం చేస్తున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ దోష పరిహారం తర్వాత అయినా అనుష్క పెళ్లి వైపు ఆసక్తి చూపుతుందనే నమ్మకంతో ఉన్నారట అనుష్క తల్లిదండ్రులు. మరి చూడాలి.. ఏమవుతుందో..!