information

ATM PIN లో నాలుగు (4) అంకెలే ఎందుకుంటాయని ఎప్పుడైనా ఆలోచించారా..? దాని వెనకున్నకారణం ఇదే..!

ATM PIN : ఏటీఎం. ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతున్న ఈ సాధనం లేనిదే మనడైలీ జీవితం ముందుకు సాగదు. అయితే మనం ఉపయోగించుకుంటున్న ఏటీఎం పిన్ నంబర్ కేవలం 4 అంకెలే ఉంటాయి. ఆ పిన్ నెంబర్ లో ఎందుకు 4 అంకెలు ఉంటాయో మీరెప్పుడైనా ఆలోచించారా ? అదే మన ఈమెయిల్, లేదా సోషల్ వర్కింగ్ సైట్స్ కైతే 6 లేదా అంతకంటే ఎక్కువ నెంబర్ లను పాస్ వర్డ్ గా ఉపయోగించుకుంటాం. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ఈ పాస్ వర్డ్స్, పిన్ నెంబర్స్ ను మన భద్రత కోసం వాడతాం. అలాంటిది ప్రతి నిత్యం అవసరమయ్యే డబ్బుల కోసం ఇంకెంత పకడ్బందీగా ఉండాలి. ఇలా ఏటీఎం పిన్ నెంబర్ 4 అంకెలుగా ఉండటానికి కారణం లేకపోలేదు.

1967నుండి వాడకంలో ఉన్న ఏటీఎంలను స్కాట్ లాండ్ కు చెందిన జాన్ ఆడ్రియన్ షెపర్డ్ బార్ కనుగొన్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. ఆయన కనిపెట్టిన ఏటీఎం కంటే కొంచెం అడ్వాన్స్డ్ మిషన్సే ఇప్పుడు వాడకంలో ఉన్నాయి. జాన్ ఆడ్రియన్ కనిపెట్టిన ఈ మిషన్ లలో డబ్బును ఇతరులు తెలుసుకోకుండా ఉండేందుకు, సెక్యూరిటీ కోసం పిన్ నెంబర్ ని పెట్టాడట. మొదట పిన్ నెంబర్స్ ను 6 అంకెలుగా ఉండేలా ఫిక్స్ చేశాడు.

why there are only 4 digits in atm pin

అయితే అన్ని అంకెలు గుర్తుపెట్టుకోవడం కష్టమని, చాలా మంది అన్ని నెంబర్స్ ని గుర్తుంచుకోవడం కష్టమని ఆండ్రియన్ భార్య వద్దని వారించిందట. ఆ తర్వాత నవ్వుతూ 4 అంకెల పిన్ నెంబర్ అయితే బెటర్ గా ఉంటుందని సూచించడంతో, 6 అంకెల పిన్ నెంబర్ ను కాస్తా 4 అంకెల పిన్ గా సెట్ చేశాడట. ఆండ్రియన్ భార్య చాలా సంతోషించిదట. ఇలా అప్ప‌టి నుంచి ఏటీఎం పిన్ నంబ‌ర్‌లో 4 అంకెలే ఉంటూ వ‌స్తున్నాయి. అయితూ కొన్ని బ్యాంకులు మాత్రం ప్ర‌స్తుతం ఏటీఎం లేదా క్రెడిట్ కార్డు పిన్ నంబ‌ర్‌ల‌ను 6 అంకెల‌తో సెట్ చేస్తున్నాయి. చాలా వ‌ర‌కు బ్యాంకులు మాత్రం ఇంకా 4 అంకెలనే వాడుతున్నాయి. అయితే ఏది ఏమైనా.. ఈ పిన్ నంబ‌ర్ల‌ను మాత్రం మ‌నం ఎవ‌రికీ చెప్ప‌కూడ‌దు. సుర‌క్షితంగా ఉంచుకోవాలి.

Admin

Recent Posts